Nithin Invites Pawan Kalyan For His Marriage: నితిన్ పెళ్లి.. పవన్ కి ఆహ్వానం !
Nithin Invites Pawan Kalyan For His Marriage: యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పలు స్టేజీల పైన కూడా నితిన్
Nithin Invites Pawan Kalyan For His Marriage: యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమానినో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పలు స్టేజీల పైన కూడా నితిన్ పవన్ పైన తనకున్నా అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. ఈనెల 26న తన ప్రేయసి షాలినితో నితిన్ పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే తన వివాహానికి రావాల్సిందిగా పవన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాడు నితిన్... అంతేకాకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా శుభలేఖను అందజేశాడట నితిన్.. ఇక దీనికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రగతి భవన్ కి వెళ్లి మరి శుభలేఖను అందజేశాడు నితిన్..
నితిన్ షాలినిల నిశ్చితార్థం ఫిబ్రవరి15న జరిగింది. ఇక ఏప్రిల్ 16 న వీరి వివాహాన్ని గ్రాండ్ గా దుబాయ్ లో చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులు భావించారు. కానీ అప్పుడే దేశంలో కరోనా వ్యాప్తి ఎంటర్ కావడంతో వివాహాన్ని వాయిదా వస్తూ వచ్చారు. ఇక తాజాగా హైదరాబాద్‌లో 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నితిన్ పెళ్లి జరుగుతుంది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
ఇక నితిన్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ విజయాన్ని అందుకున్నాడు.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్.