Tollywood Hero Nithiin: నితిన్ ట్విట్టర్‌లో 3 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్!

Tollywood Hero Nithiin: యంగ్ హీరో నితిన్ ట్విట్టర్‌లో 3 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ అందుకున్నాడు.

Update: 2020-07-17 06:45 GMT
Nithiin (File Photo)

Tollywood Hero Nithiin: యంగ్ హీరో నితిన్ ట్విట్టర్‌లో 3 మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ అందుకున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఈ ఘనత అందుకున్నాడు. ఈ సందర్భంగా నితిన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నితిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. " 3 మిలియన్ స్ట్రాంగ్! ఫీలింగ్ సో బ్లెస్సెడ్! నా ప్రయాణంలో భాగమైనందుకు.. నాపై ఇంతగా ప్రేమను చూపించినందుకు నా అమేజింగ్ ఫాలోవర్స్ అందరికీ ఒక బిగ్ థ్యాంక్స్!!'' అంటూ చెప్పుకొచ్చాడు నితిన్ ..

ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నితిన్..ఇక ఆ తరవాత సంబరం, దిల్, సై సినిమాలు నితిన్ కి మంచి పేరును తీసుకువచ్చాయి. ఆ తరవాత వరుస ప్లాపులు నితిన్ ని వెంటాడాయి. ఇక మళ్ళీ ఇష్క్ సినిమాతో మళ్ళీ నితిన్ కెరియర్ గాడిన పడింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయిందే, అఆ సినిమాలు మంచి హిట్స్ వచ్చాయి.

ఇక తాజాగా ఈ ఏడాది భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు ఈ యువ హీరో.. నితిన్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నితిన్ యువ దర్శకుడు వెంకీ అట్లూరితో 'రంగ్ దే' అనే సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా విభిన్న కథ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తో ఓ సినిమా మరియు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' రీమేక్ సినిమా చేయనున్నాడు. వీటితో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమాలో నటించనున్నాడు నితిన్.. కరోనా ప్రభావం వలన ఈ సినిమాలు షూటింగ్ లు అయితే ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి.


Tags:    

Similar News