డిజిటల్ బాటలో గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'?
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసింది. అందులో సినీ పరిశ్రమ ఒకటి.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసింది. అందులో సినీ పరిశ్రమ కుడా ఒకటి. రెండున్నర రెండు నెలల తరువాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే విషయంలో ఇప్పటికే క్లారిటీ రాలేదు. చాలా చిత్రాలు షూటింగ్ దశలోనూ.. మరికొన్న షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దంగా ఉన్నాయి. కనీ.. ఇప్పుడు థియేటర్లు తెరుచుకునే అవకాసం లేనందున విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను (ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్) ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ లో విడుదల అయ్యాయి.
ఇదే కోవలో 'అమృతరామమ్'తో పాటు మహానటితో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'పెంగ్విన్' చిత్రం అలాగే, జ్యోతిక, అమితాబచ్చన్ సినిమాలు డిజిటల్ వేదికగా (ఓటీటీలో) విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకుని పలు కారణాలతో విదులకు నోచుకొనే ఎన్నో చిత్రాలు ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
'ఆరడుగుల బుల్లెట్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌లో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. నయనతార హీరోయిన్ గా, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు నటించారు. మూడేళ్ల క్రితం మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్' షూటింగ్ పుర్తియినా చిత్రం విడుదల కాలేదు. అయితే, ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం.
గోపీచంద్, నాయన తార, బి. గోపాల్ దర్శకత్వం, ఇవన్ని ఈ సినిమాకు ఎంతగానో కలిసి వచ్చే అంశాలని.. ఈ చిత్రానికి డిజిటల్ లో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ వర్గాల అభిప్రాయపడుతునట్టు తెలుస్తుంది. ఇప్పటికే సందీప్ కిషన్ ఏడేళ్ల కింద నటించిన డికే బోస్ ఓటిటిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు జీ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం 'జీ5' ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నిర్మాతను సంప్రదించిందట. దీనికి నిర్మాత రమేష్ కూడా సుముఖంగా ఉన్నారని సినీ వర్గాల సమాచారం.