Tollywoodలో విషాదం.. కరోనాతో మరో దర్శకుడు మృతి
Tollywood: కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు
Tollywood: కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. గత ఏడాది ఈ మహమ్మారి బారిన పడి కొందరు ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ దర్శకుడు ఈ మహామ్మరికి బలైయ్యాడు. దీంతో తెలుగు సినీ పరిశ్రమంలో విషాదం నెలకొంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ రచయిత నంద్యాల రవి (42) కరోనాతో కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడి కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కోవిడ్‌ను జయించి తిరిగి వస్తాడనుకున్న నంద్యాల రవి చికిత్స పొందుతూనే మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు సమీపంలో సరిపల్లి. అతడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
నంద్యాల రవి నేనూ సీతామహాలక్ష్మీ, అసాధ్యుడు, పందెం, వంటి చిత్రాలతో రచయితగా పని చేశాడు. 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా తీసిన రాజ్ తరుణ్ కొత్త చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'తో మరోసారి రచయితగా మారాడు. ఈ మధ్యే వచ్చిన రాజ్ తరుణ్ 'పవర్ ప్లే'కు సైతం స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశాడు.
ఇటీవలే కరోనా సెకండ్ వేవ్ కారణంగా దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్, సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్‌ఆర్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి మరణించిన సంగతి తెలిసిందే.