అమితాబ్ కి సినీ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్!

HBD Amitabh Bachchan : దేశం గర్వించదగ్గ నటులలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు.. ఎన్నో పాత్రలతో, ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు అమితాబ్..

Update: 2020-10-11 06:59 GMT

Amitabh Bachchan

HBD Amitabh Bachchan : దేశం గర్వించదగ్గ నటులలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు.. ఎన్నో పాత్రలతో, ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు అమితాబ్.. ఏడూ పదుల వయసులోనూ 18 ఏళ్ల యువకుడిగా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ జీవన పోరాటం చేస్తున్నారు అయన.. నిజానికి అమితాబ్ అసలు పేరు 'ఇంక్విలాబ్'. ఆయ‌న ఇంటి పేరు శ్రీవాస్తవ. తండ్రి కలంపేరైన బచ్చన్‌ను ఇంటిపేరుగా మార్చుకున్నారు. అక్కడినుంచి మెగాస్టార్ గా, బిగ్ బీగా ఎదిగారు. అసలు సినిమాలకు నువ్వు పనికిరావు అన్నవాళ్ళతోనే శభాష్ అనిపించుకున్నారు అమితాబ్. కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అమితాబ్ కి అభిమానులు ఉన్నారు.. అలాంటి అమితాబ్ నేడు (అక్టోబర్ 11) 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నా ప్రియమైన బిగ్ బ్రదర్, ఇండియన్ సినిమా యొక్క బిగ్ బి, టాలెంట్ యొక్క పవర్ హౌస్, నా ఎప్పటికీ మార్గనిర్దేశం చేసే కాంతి, వన్ అండ్ ఓన్లీ అమిత్ జీ.. మీకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ఇలాగే ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉండండి. అలాగే మాకు స్ఫూర్తినిస్తూ ఉండండి.. : చిరంజీవి

హ్యాపీ బ‌ర్త్‌డే అమితాబ్ బ‌చ్చన్ గారు. మీ కార్యద‌క్షత‌తో మాకు, రానున్న త‌రాల‌కు స్పూర్తినిస్తూ ఉండండి : రామ్ చరణ్

లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియ‌న్ల ప్రేక్షకుల‌కు మీరే ప్రేర‌ణ‌. ఇలాగే మీరు ఎల్లప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను : మహేష్ బాబు

భారతీయ తెరపై రియల్ మసాలా మీతో ప్రారంభమైంది. థియేటర్లలో మీకోసం నేను ఎన్నిసార్లు విజిల్ చేశానో తెలియదు. లవ్ యు సార్.. మీరు ఎప్పడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి : పూరి జగన్నాధ్

Tags:    

Similar News