ఏపీ హెకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్‌!

Andhrapradesh High Court : ఏపీ హైకోర్టును టాలీవుడ్ సెలబ్రిటీలు కృష్ణంరాజు, అశ్వనీదత్ ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు తీసుకున్న తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ నటుడు కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2020-09-29 04:53 GMT

krishnam Raju, Ashwini dutt

Andhrapradesh High Court : ఏపీ హైకోర్టును టాలీవుడ్ సెలబ్రిటీలు కృష్ణంరాజు, అశ్వనీదత్ ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు తీసుకున్న తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ నటుడు కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయత్నిస్తుందని కృష్ణంరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపైన విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.

ఇక అటు అమరావతిలో తన 39 ఎకరాల భూమికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని టాలీవుడ్ నిర్మాత అశ్వనీదత్ కోర్టును కోరారు. గన్నవరంలో తానిచ్చిన 39 ఎకరాల భూమి ప్రస్తుతం ఎకరా రూ.1.84 కోట్లు చేస్తుందని, భూ సేకరణ చట్టం కింద ఈ మొత్తానికి నాలుగు రెట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఆయన తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గతంలో ఆ భూమికి సమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని అయన గుర్తుచేశారు. ఇప్పుడు రాజధానిని వేరే చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Tags:    

Similar News