మానసిక సమస్యను ఎదుర్కొంటున్న శ్రుతిహాసన్
తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు హీరోయిన్ శ్రుతిహాసన్.
తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు హీరోయిన్ శ్రుతిహాసన్. నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్ గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో నటనకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారూ.. సామాజిక అంశాలపై స్పందిస్తూ.. పోస్టులు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఇటీవల ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు చెప్పారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఆగిపోతుందన్న ఆమె ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి అన్నారు. ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పారు. అందులో ఒకటి మానసిక సమస్యగా పేర్కొన్నారు. ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నట్లు శృతి అన్నారు.
మూడేళ్లుగా మానసిక సమస్యతో తాను బాధపడుతున్నానని శృతిహాసన్ చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు శృతి చెప్పారు. దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం చికిత్స అని ఆమె అన్నారు. తాను నిత్యం క్రమం తప్పకుడా ధ్యానం, యోగ, వ్యాయామం పాటిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా పాటలు వినడం, బుక్స్ రీడింగ్, రాయడం వంటివి చేసుకుంటానని శృతిహాసన్ తెలిపారు.
తెలుగులో 2017లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆమె మళ్ళీ తెలుగులో చేయాలేదు. ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో నటించింది. ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.