మరోసారి తెరపై 'రంగ్ దే' జోడి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో 'నేను శైలజ' చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది కీర్తి సురేష్.
తెలుగు చిత్ర పరిశ్రమలో 'నేను శైలజ' చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది కీర్తి సురేష్. తోలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం జనవరి 1 2016న విడుదలైంది. తరువాత తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలను చేసింది. తెలుగులో మహానటి తన నట విశ్వరూపాన్ని నిరూపించుకుంది కీర్తి సురేష్. అలనాటి మహానటి సావిత్రి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'మహానటి'లో కేర్తి సురేష్ ప్రధాన పాత్రా పోషించింది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు తన నటనతో నిజంగానే ప్రాణం పోసింది కీర్తి సురేష్. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా జీవించేసింది. ఆ తరువాత కేర్తి సురేష్ కథల ఎంపికలో చాల జాగ్రతలు తీసుకుంది.
మహానటి విజయం తరువాత మళ్ళి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమాను చేసింది. ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కింది. సినిమాల కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే'లో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ చిత్రానికి 'తోలి ప్రేమ' దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే కరోన వైరస్, లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణం వాయిదా పడింది. ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే' చిత్రం తరువాత వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసాడు.
అందులో ఒకటి ' పవర్ పేట'.. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. హీరోయిన్ గా మరోసారి కీర్తి సురేష్ ను ఎంపిక చేసారని సమాచారం. అయితే, 'పవర్ పేట' చిత్రం రెండు భాగాలుగా రానుందని సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో 'గుడ్ లక్ సఖీ'తో పాటు 'మిస్ ఇండియా' వంటి సినిమాలు చేస్తుంది. అంతే కాదు పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు సరసన 'సర్కార్ వారి పాట' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.