Anuskha Shetty Arundhati Movie to Remake in Bollywood: బాలీవుడ్‌లో రీమేక్ కానున్న స్వీటీ 'అరుంధతి'.. హీరొయిన్ ఎవరో తెలుసా?
Anuskha Shetty Arundhati Movie to Remake in Bollywood: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన, 'సూపర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క..
Anuskha Shetty Arundhati Movie to Remake in Bollywood: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన, 'సూపర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్, తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క.. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. వీటిలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'అరుందతి' చిత్రం ద్వారా మంచి స్టార్డం సంపాదించుకుంది. ఈ సినిమాలో 'జేజమ్మ' గా అనుష్క నటన అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు మొట్టమొదటిసారిగా తెలుగు చిత్ర పరిశ్ర్రమలో హీరొయిన్ ఓరియెంటెడ్ చిత్రం దాదాపు రూ. 40 కోట్ల షేర్ రాబెట్టింది. అలాగే, ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర పోషించిన సోనూసూద్ తన అధ్బుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
ఇప్పటికి ఈ సినిమా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఒకసారి ' అరుంధతి ' చిత్రాన్నిరీమేక్ చేస్తున్నామని.. అందులో హీరొయిన్ గా ' కరీనా కపూర్' నటిస్తున్నారని వార్తలు వచ్చాయ కానీ కుదరలేదు. ఇప్పుడు తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత గీత ఆర్ట్స్ అదినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా హిందీ రైట్స్ ను భారీ రేటుకు కొనుగోలు చేసారని విస్వసనీయవర్గాల సమాచారం.
ప్రస్తుతం హిందీ ' అరుంధతి' రీమేక్ లో మాత్రం నిర్మాత కథానాయికగా దీపికా పదుకొణే పేరును పరిసీలిస్తున్నట్టు సమాచారం. అయితే, హిందీ ర్రేమకే లో మాత్రం ఎవరు దర్శకత్వం చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు దర్శకత్వం వహిస్తారా? లేక హిందీ దర్శకులు ఎవరన్న దర్శకత్వం చేస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అదే విదంగా 'అరుందతి' సినిమా హిందీ దుబ్బింగ్ వెర్షన్ కుడా టీవీలలో మంచి టీఆర్పీ ని తెచ్చిపెడుతుంది. ఇక దీపికా పదుకొణే విషయానికి వస్తే టాలీవుడ్ యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన హీరొయిన్ గా నాగ్ అశ్విన్ దర్శత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఇది దీపిక కు తెలుగులో మొదటి చిత్రం కావటం.. అలాగే వైజయంతి మూవీస్ సమస్త ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.. ఇటీవలే ఈ సంస్థ 50 వసంతాలు పుర్తిచేసుంది.