HBD Prakash Raj: ఈ మోనార్క్‌ను ఎవరూ రీప్లేస్ చేయలేరు..నటనలో విశ్వరూపమే
HBD Prakash Raj: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగిన నటులలో ముందు వరసలో ఉంటారు ప్రకాశ్‌రాజ్.
HBD Prakash Raj: ప్రకాష్ రాజ్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగిన నటులలో ముందు వరసలో ఉంటారు ప్రకాశ్‌రాజ్. విలక్షణ నటనతో సౌత్ ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. సినిమాల్లో తండ్రి పాత్రేనా.,ప్రతినాయకుడి క్యారెక్టరైనా ముందుగా గుర్తొచ్చేది మాత్రం ప్రకాశ్ రాజే. ఎటువంటి పాత్రకైనా పాణం పెట్టి చేసే నటుడెవరంటే మనందరికి గుర్తుకు వచ్చే ముందు పేరు ప్రకాష్ రాజ్ దే. మోనార్క్ వంటి తండ్రైనా...బొమ్మరిల్లు ఫాదరైనా...అంత:పురం వంటి నానైనా...పోకిరిలో విలన్ క్యారెక్టరైనా ప్రకాష్ రాజ్ ముందు సలామ్ చేయాల్సిందే.
తెలుగులో యస్వీరంగారావు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట శ్రీనివాస్ రావుల తర్వాత అంతటి క్రేజ్ సంపాదించిన వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. తెలుగులో ప్రకాశ్ రాజ్ చేసిన ఒక్కడు, స్టాలిన్ వంటి విభిన్న పాత్రలను అవలిలగా పోషించాడు. ఒక్కడు సినిమాలో హీరోయిన్ వెంటపడుతూ ఎలాగైనా తనను దక్కించుకోవాలనే ఆశతో ఉండే విలన్.. స్టాలిన్ చిత్రంలో అయితే ప్రకాశ్ రాజ్ వయస్సుకు మించిన పాత్ర ఓ వృద్ధుడి క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.
ఇక ఢమరుకం(శివుడు), తమిళ చిత్రం గది నెం.305(విష్ణువు)లో భగవంతుడి పాత్రలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తండ్రిగా అద్భుతమైన ఎమోషన్స్ పండిస్తారు. పరుగు, నువ్వే నువ్వే సినిమాల్లో అయితే కూతురు మరో వ్యక్తి ప్రేమించనా.. ఆ విషయం తెలిసి కూడా కన్న తండ్రి ప్రేమకంటే ఏదీ ఎక్కవ కాదు అనే అంతగా ప్రకాశ్ రాజ్ పలికించిన హావభావాలు ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించాయి. నువ్వునాకు నచ్చావ్, ఎఫ్ 3 వంటి సినిమాల్లో కామెడీ కూడా పండించారు. ఖడ్గం చిత్రంలో ఆయన నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఏ పాత్ర ఇచ్చినా సరే దానికి ప్రాణం పోస్తారు. నటుడిగానె కాకుండ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. తొలిసారి 'దయ' అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. అక్కడి నుంచి తన అభిరుచి మేరకు పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే వచ్చారు. తెలుగులో 'గగనం' చిత్రాన్ని నిర్మించారు.
జననం:
ప్రకాష్ రాజ్ 26 మార్చి 1965 న జన్మించారు. కన్నడ వ్యక్తి అంటే ఎవరూ నమ్మరేమో.. తెలుగు ప్రేక్షకుడి మనసు అస్సలు ఒప్పుకోవేమో అన్నంతగా ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రకాష్ రాజ్ పుట్టి పెరిగిందంతా బెంగుళూరులోనే. ఆయన నటన మీద ఆసక్తితో చదువుకోలేదు. దాదాపు రెండు వందల సినిమాలకుపైగా నటించి, ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. తెలుగు, తమిళ్, కన్నడ్, మళయాళం, హింది వంటి భాషల చిత్రాలలొ నటించారు. ఫిల్మీం ఇండస్ట్రీ అంటే ప్రేమతో మొదట టెలివిజన్ రంగంలొ అడుగుపెట్టి సినిమాల దిశగా సాగాడు.
వివాహం
ప్రకాష్ రాజ్ నటి లలిత కుమారిని (1994) వివాహం చేసుకున్నారు. ఆమె ప్రముఖ నటి డిస్కో శాంతి కి సోదరి. దివంగత సినీనటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి.. ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి.. ఇద్దరు అక్కా చెల్లెలు. వీళ్ల నాన్న సి.ఎల్. ఆనంద్ .. కన్నడ, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటుడిగా, విలన్‌గా నటించి మెప్పించాడు. ఈయన కూతుళ్లలో పెద్దమ్మాయి లలిత కుమారిని ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నాడు. రెండో అమ్మాయి డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమ వివాహాం చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ తరువాత 2009లొ విడాకులు తీసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు మేఘనా, పూజ, కుమారుడు సిధు ఉన్నారు. ప్రకాష్ 2010లొ బాలీవుడ్ కు చెందిన కొరియొగ్రాఫర్ పోని వర్మని రెండవ వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు వేధాంత్ ఉన్నాడు.
అవార్డులు
ఉత్తమ ప్రతినాయకుడు - గంగోత్రి, 2003 నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ సహాయనటుడు - దూకుడు..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాతో కలిసి మూడు సినిమాలకు నందీ అవార్డులు అందుకున్నాడు. 'ఇద్దరు' చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా తొలిసారి జాతీయ అవార్డును.. 'కాంచీవరం' చిత్రానికి ఉత్తమనటుడిగా అవార్డు దక్కించుకున్నారు. అయిదుసార్లు ఫిలింఫేర్ అవార్డు, ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ అవార్డు ఒకసారి, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును నాలుగుసార్లు, విజయ అవార్డును మూడుసార్లు సొంత చేసుకున్నారు.
సేవా దృక్పదం:
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండరెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కరవు భత్యం కోసం పోరాడుతున్న తమిళ రైతులకు దిల్లీ వెళ్లి మద్దతు తెలిపారు. కరోనా కారణంగా పలువురు వలస కూలీలను తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం ఇచ్చి భోజన సదుపాయాలు కల్పించారు.
సినిమాల్లో నిషేదం:
ప్రకాష్ రాజ్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సినీ దర్శకులు, హీరోలతో ఆయన తరచూ గొడవలు జరిగేవని ఆరోపణలు వచ్చాయి. మహేశ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ విషయంలో విభేదాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వారు అనేవారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిని ప్రకాశ్ రాజ్ ప్రశ్నీస్తూ.. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఒకనొక సందర్భంతో ప్రకాశ్ రాజ్ స్వయంగా వివాదాలపై నోరువిప్పారు కూడా..హీరోలు,దర్శకులతో భిన్నభిప్రాయలే తప్ప విభేదాలు లేవు అంటూ చెప్పుకొచ్చారు.
అయితే 2018 వరకూ దాదాపు ఆయన లేని సినిమా లేదనే చెప్పాలి. ఆగడు చిత్రంలో ప్రకాష్ రాజ్, సహాయ దర్శకుడి మధ్య ఆమధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ రాజ్ పై తెలుగు నిర్మాతల మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్ దేనిని అడ్డుకోలేకపోయింది. అందుకే ఎలాంటి బ్యాన్‌లు ప్రకాష్‌రాజ్‌పై విధించినా ఆయన సినీ అవకాశాలను మాత్రం అడ్డుకోలేకపోయాయి.
రాజకీయాల్లో ప్రస్థానం
ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయారు. బీజేపీ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ వచ్చిన సినిమా అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటూనే వెళుతున్నారు. కర్ణాటకలోని బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైయ్యారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం టాలీవుడ్‌లో ప్రకాష్ రాజ్‌కు డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి.
ప్రకాష్ మూవీ డైలాగ్స్
నేను మోనార్క్ ను.నన్నెవరూ మోసం చేయలేరు
స్వప్న సంక్రాంతి ముగ్గయితే, నేను గొబ్బమ్మని రా..
భారతీయులందరు పాడుతున్న వందేమాతరం రాసిన వాడు ఓ ముసల్మాన్ (అజాద్)
20ఏళ్లు పెంచాను కాబట్టి తండ్రిగా నేనంటే ఇష్టం.. 80 ఏళ్లు కలిసి బ్రతకాలి కాబట్టి వాడంలే ఇష్టం..
నీజీవితంలో 100మార్కులు ఉంటే 20తండ్రికి 80 ప్రేమించిన వాడికి కనీసం 15 మార్కులు వేసిన ఈ నాన్నాను పాస్ చేయలేకపోయావా? అంటూ నువ్వే నువ్వే చిత్రంలో ప్రకాశ్ నోటి వెంట పలికిన మాటలు, భవోద్వేగ సన్నివేశాలు యువతకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రకాష్ రాజ్ నటించిన సినిమాల్లో కొన్ని డైలాగులు మాత్రమే.