పెళ్లి రోజు కంగారుపడ్డా..పారిపోవాలనుకున్నా... మంచు లక్ష్మీ

తెలుగు సినీ ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి మంచు లక్ష్మి.

Update: 2020-05-29 14:28 GMT
Manchu Lakshmi (File Photo)

తెలుగు సినీ ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో యక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న మంచు లక్ష్మి తన పెళ్లి ఆల్బమ్‌ను తిరగేశారు.2006లో ఆండీ శ్రీనివాస్‌తో మంచు లక్ష్మికి వివాహం జరిగింది. ఫోటోలను చూసి పెళ్లి రోజు జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. తన వివాహం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని ఇన్‌స్టా‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి రోజున చాలా కంగారుపడ్డానని పేర్కొన్నారు. పెళ్లి కుమార్తెగా సిద్ధమై.. వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత తొలి గంట బిడియంగా అనిపించిందని, బయటికి వెళ్లే దారి కోసం సీరియస్‌గా వెతికానని అన్నారు. అదేవిధంగా పెళ్లి కూతురు ఫంక్షన్‌లో తండ్రి మోహన్‌బాబుతో దిగిన మరో ఫొటోను కూడా పంచుకున్నారు.

మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ. సరోగసీ పద్ధతి ద్వారా మంచు లక్ష్మి తల్లి అయిన విషయం తెలిసిందే. 2018లో వచ్చిన 'Mrs. సుబ్బలక్ష్మి' వెబ్‌ సిరీస్‌లో మంచు లక్ష్మి చివరిసారిగా కనిపించారు.


Delete Edit


Tags:    

Similar News