Jaya Prakash Reddy : విలనిజం.. వాత్సల్యం.. హాస్యమకరందం.. జయప్రకాష్ రెడ్డి
Jaya Prakash Reddy : ఇది నిజంగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు మరో తీరని లోటు అని చెప్పాలి. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది విలన్ రోల్స్
Jaya Prakash Reddy : ఇది నిజంగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు మరో తీరని లోటు అని చెప్పాలి. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది విలన్ రోల్స్ చేసినప్పటికీ విలనిజం అనే పదానికి సిసలైన అర్ధం చూపింది మాత్రం మన తెలుగు విలక్షణ నటుడు జయ ప్రకాష్ రెడ్డి అని చెప్పాలి. ఎన్నో చిత్రాల్లో ట్రెండ్ సెట్టింగ్ విలన్ రోల్స్ తో పాటుగా ఎన్నో రోల్స్ చేసిన ఈ అద్భుతమైన సీనియర్ నటుడు ఇప్పుడు కన్నుమూసారన్న వార్త తెలుగు సినిమా వర్గాలను విస్మయానికి గురి చేసింది.
జయప్రకాశ్ రెడ్డి బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. ఈ సినిమా 1988లో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా ఆయనకి అంతగా పేరు తీసుకురాలేదు.. ఆ తరవాత శ్రీనువైట్ల 'నీకోసం'లో అయన చేసిన విలన్ రోల్ కి ప్రశంసలు లభించాయి. ఇక వెంకటేష్ 'ప్రేమించుకుందాం రా' చిత్రం జయప్రకాష్ రెడ్డిలోని అసలైన నటుడుని బయటపెట్టింది. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలలో అయన పండించిన విలనిజానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.. విలన్ అంటే ఇలాగే ఉండాలి. ముఖ్యంగా ఫ్యాక్షన్ మూవీలో హీరోకి ప్రతినాయకుడు పాత్ర అంటే ముందుకు ఆయనే గుర్తోచ్చేవారు. ఆ పాత్రలకి తగ్గట్టుగా అయన పలికే రాయలసీమ స్లాంగ్ అయనకి మరో ప్లస్ గా నిలిచింది. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఇదే స్లాంగ్ తో, ఇదే విలన్ రోల్స్ తో చాలా సినిమాల్లో నటించారు జయప్రకాశ్ రెడ్డి.. అయనప్పటికి ఎక్కడ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించలేదు.
జయప్రకాశ్ రెడ్డిని దర్శకుడు బి గోపాల్ విలన్ గా ఓ లెవెల్ లో చూపిస్తే ఈయన కామెడీ కూడా చేయగలడు అని చూపించిన దర్శకుడు శ్రీనువైట్ల... మొదటి సినిమాలో ఆయనని విలన్ గా చూపించిన శ్రీనువైట్ల ఆ తర్వాత ఆనందం, సొంతం, రెడీ, ఢీ చిత్రాలలో మంచి మంచి కామెడీ రోల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా ఢీ సినిమాలో కేవలం వీల్ చైర్ లో కూర్చొని అయన పండించిన హాస్యానికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.. ఇక ఎవడిగోల వాడిది, కబడ్డీ కబడ్డీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, విక్రమార్కుడు మొదలగు చిత్రాలు అయనకి హాస్య నటుడిగా మంచి పేరును తీసుకువచ్చాయి. సెంటిమెంట్ సన్నివేశాలలో కూడా అయన పాత్ర అమోఘం అనే చెప్పాలి. అటు విలన్ గా బయపెట్టించి, ఇటు కామెడీలో నవ్వించి ప్రేక్షకుల మనుషులను దోచుకున్నారు జయప్రకాశ్ రెడ్డి.. ఇలాంటి నటులు ఇండస్ట్రీలో చాలా తక్కువేనని చెప్పాలి. అయన మన మధ్య ఇప్పుడు భౌతికంగా లేకపోయిన ఆయన సినిమాలతో ఎప్పటికి మన మధ్యే ఉంటారు.