Most Desirable Men: ఎన్టీఆర్ 3, చ‌ర‌ణ్ 4, ఫ‌స్ట్ ఎవ‌రంటే?

Most Desirable Men: సందీప్ కిషన్ - రానా- అల్లు అర్జున్- అఖిల్ లాంటి స్టార్లు టాప్ 30 జాబితాలో ఉన్నారు.

Update: 2021-06-02 12:00 GMT

ఎన్టీఆర్ , చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ ఫోటో

Most Desirable Men: టాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కులు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్- 2020 జాబితాలో స్నేహితులు వీరిద్ద‌రికి ప్లేస్ ద‌క్కింది. తారక్ మూడో స్థానంలో ఉండ‌గా.. రామ్ చరణ్ నాలుగో స్థానాల్ని కైవశం చేసుకున్నారు. దీంతో ఈ విష‌యం టాక్ ఆఫ్ ది టైన్ గా మారింది.

ఇక ఆ ఇద్దరూ జిమ్నాస్ట్ లుగా మారి తీరైర రూపు రేఖలతో యువత గుండెల్లోకి చొచ్చుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్- 5లో చోటు దక్కింది. 2019 లో టైమ్స్ జాబితాలో 19 వ స్థానంలో నిలిచిన తారక్ ఈసారి మూడో స్థానానికి ఎదిగారు. తన స్నేహితుడు రామ్ చరణ్ నాల్గవ స్థానంలో నిలిచాడు. ఇక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో నంబర్ వన్ గా విజయ్ దేవరకొండ.. నంబర్ 2గా రామ్.. నిలవగా నాలుగు ఐదు స్థానాల్లో నాగశౌర్య- నాగచైతన్య నిలిచారు. సందీప్ కిషన్ - రానా- అల్లు అర్జున్- అఖిల్ లాంటి స్టార్లు టాప్ 30 జాబితాలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆర్.ఆర్.ఆర్ మూవీలో న‌టింస్తున్నారు. ద‌ర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). స్వాతంత్ర్య సమరవీరులు అల్లురి సీతారామరాజు(రామ్ చరణ‌్), కొమరం భీం( ఎన్టీఆర్) పాత్రల్లో ఇద్దరు హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,టీజర్స్ విడుదల అయ్యాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇటీవ‌లే ఈ సినిమా శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ కొలుగొలు చేసిన ఓటీటీల‌ను, టీవీ చాల‌న్స్ లిస్ట్ విడుద‌ల చేశారు. థియేటర్‌లో విడుదల తర్వాత డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులను 'పెన్‌ స్టూడియోస్‌' దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది. సినిమా ప్రసారం కానున్న డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్‌ స్టూడియోస్ వెల్ల‌డించింది. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లో ప్రసార హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స(Netflix) దక్కించుకుంది.

Tags:    

Similar News