The Kerala Story: ది కేరళ స్టోరీకి కలెక్షన్ల వర్షం.. ఎంపీలో పన్ను మినహాయింపు..
The Kerala Story: సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఈ శుక్రవారం వచ్చిన ది కేరళ స్టోరీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశగా మారింది.
The Kerala Story: సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఈ శుక్రవారం వచ్చిన ది కేరళ స్టోరీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశగా మారింది. లవ్ జిహాద్ పేరిట కేరళలో 32వేల మందికిపైగా అమాయక యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని చెబుతూ తీసిన ఈ చిత్రంపై కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సినిమాను నిషేధించాలంటూ సుప్రీంలో పిటిషన్ కూడా వేశారు. అయితే రిలీజ్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విడుదలైన ఈ సినిమా ఊహించినట్లుగానే మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. తొలిరోజే ది కేరళ స్టోరీ...మరో వివాదాస్పద మూవీ అయినా కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్స్ కు క్రాస్ చేసింది. మొదటి రోజే రూ.7.5 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
ది కేరళ స్టోరీ చిత్రాన్ని కాంగ్రెస్, వామపక్షాలు వ్యతిరేకిస్తుంటే..బీజేపీ, హిందూ సంస్థలు మాత్రం ఈ సినిమాను చూడాలంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ది కేరళ స్టోరీకి పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియోను విడుదల చేశారు. పిల్లలు, పెద్దలూ అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మత మార్పిడుల నిరోధానికి చట్టం తీసుకొచ్చింది. ఈ చిత్రం కూడా మతమార్పిడులపై అవగాహన తీసుకొస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు, చిన్నారులు, ఆడ పిల్లల అందరూ వీక్షించదగ్గ చిత్రం. అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను రాయితీ ఇస్తోంది అని చౌహాన్ అన్నారు.