Squid Game 2: మనుషుల్ని చంపేసే ఆట.. స్క్విడ్ గేమ్‌2 స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. ?

Squid Game 2: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాషతో సంబంధం లేకుండా కంటెంట్‌ను ప్రేక్షకులలు వీక్షిస్తున్నారు.

Update: 2024-12-25 05:27 GMT

Squid Game 2: మనుషుల్ని చంపేసే ఆట.. స్క్విడ్ గేమ్‌2 స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

Squid Game 2: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాషతో సంబంధం లేకుండా కంటెంట్‌ను ప్రేక్షకులలు వీక్షిస్తున్నారు. కొరియన్‌ వెబ్‌ సిరీస్‌లు కూడా తెలుగులో డబ్‌ అవుతున్నాయంటేనే ప్రేక్షకుల అభిరుచులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. ఇలాంటి ఓ కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే స్క్విడ్ గేమ్‌. సాధారణంగా ఏ గేమ్‌లో అయిన ఓడిపోతే ఆట నుంచి ఎలిమినేట్ అవుతారు. కానీ ఈ గేమ్‌లో ఎలిమేట్ అయితే ఏకంగా ప్రాణాలే పోతాయి.

జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. ఆ తర్వాత వారితో రకరాల గేమ్స్‌ ఆడిపిస్తుంటారు. సింపుల్‌గా కనిపించే గేమ్స్‌లో ఓడిపోతే మాత్రం ప్రాణాలు తీసేస్తారు. తొలి సీజన్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సిరీస్‌ డిసెంబర్‌ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.

తొలి సీజన్‌లో చివరిగా మిగిలిన వ్యక్తి ప్రైజ్‌ మనీతో బయటకు వచ్చేస్తాడు. అయితే రెండో సీజన్‌లోనూ మళ్లీ అతడు పాల్గొంటాడు. అయితే ఇంతకీ ఈ ఆటను ఎవరు ఆర్గనైజ్‌ చేస్తున్నారు.? అసలు వీరి ఉద్దేశం ఏంటి.? లాంటి ఎన్నో ప్రశ్నలు మొదటి సీజన్‌లో మేకర్స్‌ అలాగే ఉంచారు. తొలి సీజన్‌లో గెలిచిన హీరో ఈ విషయాలను తెలుసుకునే పనిలో పడ్డట్లు సీజన్‌ 2 ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మనుషులు చనిపోతారని తెలిసినా మళ్లీ రెండో సీజన్‌లో ఎందుకు పాల్గొంటాడు. అసలు ఈ గేమ్‌ వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తాడన్న విషయం స్పష్టమవుతోంది. కాగా రెండో సీజన్‌లో తొలి సీజన్‌కి మించి ఈసారి ఎక్కువ ఎమోషనల్‌ సీన్స్‌ ఉండనున్నాయని తెలుస్తోంది.

మరి కాసేపట్లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న స్క్విడ్ గేమ్‌2 ఈసారి ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే స్క్విడ్‌ గేమ్‌ వెబ్‌ సిరీస్‌ వెనకాల ఎంతో పెద్ద కథ ఉంది. ఈ కథను 2009లోనే దక్షిణ కొరియా దర్శకుడు హ్వాంగ్‌ డాంగ్‌ హ్యుక్ రాసుకున్నాడు. వెబ్‌ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మాత్రం పదేళ్లు పట్టింది. దర్శకుడు ఆర్థికంగా ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు కూడా సిరీస్‌ ఆలస్యానికి కారణంగా మారాయి.

Tags:    

Similar News