Drugs Case: డ్రగ్స్ కేసుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ

Tollywood Drugs Case: 2017లో టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసు

Update: 2021-09-21 04:06 GMT

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఛార్జ్ షీట్ తీసుకున్న ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సినీ రంగాన్ని కుదిపేసింది. డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ లో సంచలన అంశాలు వెలుగలోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారించింది ఎక్సైజ్ శాఖ. 2020 డిసెంబర్ 9న రంగారెడ్డి కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో సినీప్రముఖుల విచారణలో బలమైన ఆధారాలు లభించలేదని.. వారందరికీ ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని ఎక్సైజ్ కోర్టుకు తెలిపింది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 చార్జ్ షీట్లు ధాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ శాఖ దాఖలు స్వీకరించిన రంగారెడ్డి కోర్టు డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ ను డిసెంబర్ 9 న కోర్టుకు హాజరుకావాలని కోర్టు సమస్లు జారీ చేసింది.

2017 జులై 2 న కెల్విన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు నిఖిల్ శెట్టి అలియాస్ నిశ్చయి, రవి కిరణ్‌లను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కెల్విన్ ఇంట్లో సోదాలు చేసిన ఎక్సైజ్ శాఖ కెల్విన్ బెడ్ రూంలో రెండు కేజీల గాంజాతో పాటు 30 గ్రాముల mdma 650 LSD bolt డ్రగ్స్,పెన్ డ్రైవ్ సీడీలు 3, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వారెంట్ టైంలో గోడదూకి పారిపోయేందుకు కెల్విన్ ప్రయత్నం చేశాడని ఎక్సైజ్ శాఖ అధికారులు చార్జ్ షీట్ లో వెల్లడించారు. పోలీసులు సెర్చ్ చేసే సమయానికి ల్యాప్ టాప్ లో ఉన్న డేటా మొత్తం కెల్విన్ ఎరేజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కోంది.

ఎక్సైజ్ శాఖ విచారణ కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2013 నుంచి కెల్విర్ డ్రగ్స్‌కు బానిసైనట్లు అధికారులు గుర్తించారు. మంగళూరులో చదవుతున్న సమయంలో ప్రెండ్స్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ అలవాటు చేసుకున్నట్లు తెలిపారు. కోడ్ భాషలో ఆర్డర్ తీసుకుంటూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కోంది. చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదని ఎక్సైజ్ శాఖ తేలిపింది.

కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా NDPS act 67 యాక్ట్ ప్రకారం సినితారలకు నోటీసులు ఇచ్చి విచారించినట్లు ఎక్సైజ్ శాఖ చార్జ్ షీట్ లో పేర్కోంది. జూలై 3, 2017న తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసు పై సిట్ ఏర్పాటు చేసింది. అప్పటి ఎక్సైజ్ ఎన్పోర్స్ మెంట్ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ నేతృత్వంలో విచారించారు అధికారులు. జూలై 19. 22వ తేదీలలో సినీ తారల నమూనాలు సేకరించి ఎఫ్ ఎస్ఎల్ కు ఎక్సైజ్ శాఖ అధికారులు పంపించారు. డిసెంబర్ 9 2020 లో FSL రిపోర్ట్ లో సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. పూరి జగన్నాధ్, తరుణ్ స్వచ్చందంగా నమూనాలు ఇచ్చారని వారు ఇచ్చిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్లు ఎక్సైజ్ శాఖ చార్జ్ షీట్ లో తెలిపింది.

Full View


Tags:    

Similar News