Drugs Case: డ్రగ్ నుంచి టాలీవుడ్ బయటపడే మార్గమే లేదా..?
Drugs Case: ఐదేళ్ల క్రితం కెల్విన్ పట్టుబడడంతో మొదలైన అరాచకం
Drugs Case: డ్రగ్ మహమ్మారి హైదరాబాద్‌ను పట్టి పీడిస్తోంది. నార్కోటిక్ వింగ్ ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా..ఏదో రకంగా ఎంట్రీ ఇస్తూనే ఉంది. ఇక భాగ్యనగరంలో ఎప్పుడు డ్రగ్ ముఠా పట్టుబడినా ఆ లింక్‌లు టాలీవుడ్‌లో బయటపడుతున్నాయి. ఇటీవల మాదాపూర్ డ్రగ్ కేసులో.. హీరో నవదీప్ పేరు బయటికి వచ్చింది. అతన్ని పోలీసులు విచారించి కీలక విషయాలు రాబట్టారు. నవదీప్‌పై ఆరోపణలు రావడం ఇది కొత్తేం కాదు, గతంలోనూ డ్రగ్ కేసులో నవదీప్‌ను విచారించారు నార్కోటిక్ పోలీసులు. అంతకు ముందు..టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి, బస్తీ మూవీ మేకర్స్ కూడా డ్రగ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారిస్తే డ్రగ్స్ దందాలో ఇంకా ఎంతమంది పేర్లు బయటపడతాయో అనే చర్చ జరుగుతోంది.
హైప్రొఫైల్ పిల్లలతో పాటు కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీస్ కూడా డ్రగ్ బారినపడుతున్నారు. ఐదేళ్ల క్రితం తొలిసారిగా టాలీవుడ్‌ను షేక్ చేసింది డ్రగ్ కేసు. కెల్విన్ అనే డ్రగ్ పెడ్లర్‌ను విచారిస్తే అరాచకం మొత్తం బయటపడింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు కూడా ఆ లిస్టులో ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు డ్రగ్ ముఠా పట్టుబడ్డ ప్రతిసారీ..ఆ లింకులు టాలీవుడ్ పైనే చూపిస్తున్నాయి.
డ్రగ్ మహమ్మారి నుంచి టాలీవుడ్ బయటపడే మార్గమే లేదా..? ఎందుకు దీన్ని ఎవరూ నివారించలేకపోతున్నారు. అసలు వీరికి డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఎలా ఏర్పడుతున్నాయి. ఎవరు వీరిని డ్రగ్ వైపు ప్రోత్సహిస్తున్నారు అనేది పెద్ద ప్రశ‌్నగా మారింది. డ్రగ్ కంట్రోల్ కోసం ఎన్ని స్పెషల్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసినా.. మత్తు మహమ్మారి మాత్రం టాలీవుడ్‌ను వదలడం లేదు. సినిమా అంటేనే ఓ అందమైన లోకం. హిట్స్ వస్తే ఆల్ హ్యాపి. కానీ ఫ్లాప్స్ వచ్చినా.. కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం మొదలైనా అది తట్టుకోలేక డ్రగ్స్ బారినపడుతున్నారు.
హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరాలో పెద్ద తలకాయల పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల అండ, పోలీసుల సహకారంతోనే గ్రేటర్‌లో డ్రగ్ సరఫరా విచ్చల విడిగా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఎంత నివారణ చర్యలు తీసుకుంటున్నా..ఏదో ఓ రకంగా డ్రగ్ ఎంట్రీ ఇస్తూనే ఉంది. అందుకే డ్రగ్ మహమ్మారిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. కొంతమంది బడాబాబుల అండదండలతో హైదరాబాద్‌లో డ్రగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
ఐతే హైదరాబాద్ హెచ్ న్యూ ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల కట్టదిట్టమైన చర్యలతో.. హైదరాబాద్ లో డ్రగ్స్ కన్జూమ్ చేయడం తగ్గిందట. కానీ హైదరాబాద్ నుంచి గోవా వెళ్లి డ్రగ్స్ కన్జూమ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఫ్లైట్ లలో వెళ్లి మరీ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఐడెంటిఫై చేశారు. బెంగుళూర్ కేంద్రంగా డ్రగ్ పెడ్లర్స్ ఈ దందాను నడుపుతున్నారు. టీ నాబ్ నజర్ తో డ్రగ్స్ రాకెట్స్ లింకులు కదులుతున్నాయి. డ్రగ్స్ కన్జూమర్స్ ఇచ్చిన ఇన్ఫర్మెషన్ ఆధారంగా అరెస్టులు చేస్తున్నారు. గోవా, కర్ణాటక వెళ్లి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.