Johaar Trailer : అంతరిక్షం నుండి చూస్తే విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయా.. పేదరికం కనిపించదా?
Johaar Trailer : కరోనా ప్రభావం ప్రతి ఒక్కరంగం పైన పడింది.. అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. దీనివలన సినిమా షూటింగ్ లు మాత్రమే కాదు..
Johaar Trailer : కరోనా ప్రభావం ప్రతి ఒక్కరంగం పైన పడింది.. అందులో సినిమా ఇండస్ట్రీ ఒకటి.. దీనివలన సినిమా షూటింగ్ లు మాత్రమే కాదు.. ధియెటర్లు కూడా బంద్ అయిపోయయాయి.. ప్రస్తుతానికి షూటింగ్ లకి అయితే అనుమతి అయితే లభించింది కానీ ధియెటర్లు ఇంకా ఓపెన్ కాలేదు.. దీనితో చిత్ర నిర్మాతలు ఓటీటీ బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా విడుదలయ్యాయి.. అందులో భాగంగానే మరో చిత్రం ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యేందుకు సిద్దం అయింది. అదే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'జోహార్'
పోస్టర్స్, టైటిల్ తో అందరిని ఆకర్షించిన ఈ సినిమా తాజాగా ట్రైలర్ తో అంచనాలను భారీగా పెంచేసింది.. రెండు నిమిషాల అయిదు సెకండ్స్ ఉన్న ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఫస్ట్ నుంచి చివరివరకూ చూపు తిప్పుకోకుండా చేసింది. విగ్రహ ఆవిష్కరణ అంటూ ఈ ట్రైలర్‌లో శిలాఫలకం దర్శనం, ఉద్దానం సమస్య, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగిపోతే ఈ రాష్ట్రం భగ్గుమంటోంది, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయినా సరే మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తాను అన్న డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తుంది. 'అంతరిక్షం నుండి చూస్తే విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయా సార్.. పేదరికం కనిపించదా వంటి డైలాగులు' ఆలోచింపజేస్తున్నాయి.. ప్రేమ, లక్ష్యం, అవసరం, ఆరోగ్యం కోసం పోరాడే నలుగురు జీవితాల్ని ఏవిధంగా చిన్నాభిన్నం అన్న నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా రేపు (ఆగస్టు 15)న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఎస్తేర్ అనీల్, ఈశ్వరీరావు, క్రిష్ణ చైతన్య, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.