Bigg Boss Season 5: సెప్టెంబర్ 5 నుండి మొదలు కాబోతున్న బిగ్ బాస్
* తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ ఐదవ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Bigg Boss Season 5: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ ఐదవ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా 4 సీజన్లను పూర్తిచేసుకోగా, అన్నీ మంచి టిఆర్పి లతో ప్రేక్షకులను అలరించాయి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ లో నాని హోస్ట్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. గత రెండు సీజన్ల నుంచి టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఐదవ సీజన్ లో కూడా నాగార్జున హోస్ట్ గా కనిపించనున్నారు. తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేసింది స్టార్ మా.
బిగ్ బాస్ లోగో పక్కన గన్ను పట్టుకుని స్టైలిష్ స్టైల్ గా కూర్చున్నారు నాగార్జున. ఈ ఆదివారం అనగా సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు నుంచి బిగ్ బాస్ మొదలు కాబోతుంది అని పోస్టర్ ద్వారా తెలియజేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి పదిగంటలకు, శని ఆది వారాలలో మాత్రం రాత్రి తొమ్మిదింటికి బిగ్ బాస్ ఎపిసోడ్ రాబోతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే అని ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి కానీ వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే సీజన్ 5 కంటెస్టెంట్ లు గురించి తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.