TFCC: ఓటీటీ వద్దు- సినిమా హాళ్ళు ముద్దు

Telangana Film Chamber of Commerce Press Meet: గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి దెబ్బకి చిన్న నుండి పెద్ద వ్యాపారులు..

Update: 2021-07-07 13:54 GMT

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

TFCC: గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి దెబ్బకి చిన్న నుండి పెద్ద వ్యాపారులు కొంతకాలం వరకు నష్టాలతో కోలుకోలేని విధంగా మారిపోయారు. అన్ని పరిశ్రమలతో పాటు సినిమా రంగంలో ఎన్నో కోట్లు పెట్టి నిర్మించే సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే సినిమా థియేటర్స్ ని కాపాడాలని ఓటిటికి సినిమా థియేటర్స్ ని కాదని వెళ్ళ వద్దని "సినిమా హాళ్ళ‌ను కాపాడండి - ఓటీటీకి వెళ్ళ‌కండి" అంటూ హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో నినాదాలు హోరెత్తాయి. బుధవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి పాల్గొన్న ఈ సమావేశంలో మాట్లాడుతూ గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ వరకూ వేచి ఉండాలని కోరారు.

ఒకవేళ అప్పుడు కూడా కరోన పరిస్థితి ఇలానే ఉండి థియేటర్స్ తెరుచుకొని పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానం చేసినట్లుగా సునీల్ నారంగ్ తెలిపారు. ఎగ్జిబిటర్స్ కష్టాలను గుర్తించాలని తెలుగు పరిశ్రమ బడా నిర్మాతలు థియేటర్స్ వల్ల ఎన్నో లాభాలు పొందారని కాని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో థియేటర్స్ నూ కాదని ఓటిటి కి సినిమాలు ఇవ్వడంపై తమ ఆవేదనని వ్యక్తం చేశారు. ఏ సినిమా అయిన విడుదలైన 28 రోజుల తర్వాతే ఓటిటి కాని ఇతర శాటిలైట్ కి గాని ఆ సినిమా హక్కులను ఇవ్వాలని అలా కాకుండా నిర్మాతలు ఓటిటి బాట పడితే రానున్న కాలంలో తమ నిర్ణయాలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 

Tags:    

Similar News