సినీ పరిశ్రమ పై సీఎం కేసీఆర్ వరాల జల్లు

ఇక రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు SGST రీయంబర్స్ మెంట్ సాయం చేస్తామని వెల్లడించారు. చితికిపోయిన ప‌రిశ్ర‌మ‌ను పున‌రుజ్జీవింప‌చేయ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

Update: 2020-11-23 10:23 GMT

గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ పై వరాల జల్లు కురిపించారు. కరోనా వలన నష్టపోయిన సినిమా పరిశ్రమకి భారీ రాయితీలు ప్రకటించారు. సినిమా ధియెటర్లు, పరిశ్రమలకు, అన్ని రకాల షాపులకు వచ్చిన కరెంట్ బిల్లును ( మినిమం డిమాండ్ చార్జీ ) చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు ఇది వర్తిస్తుందని అన్నారు. ఇక అన్ని రకాల ధియేటర్లలలో షోలు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ తరహలో సినిమా టికెట్ల ధరలను సవరించే వెసులుబాటును కల్పించారు.

ఇక రూ. 10 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు SGST రీయంబర్స్ మెంట్ సాయం చేస్తామని వెల్లడించారు. చితికిపోయిన ప‌రిశ్ర‌మ‌ను పున‌రుజ్జీవింప‌చేయ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అటు డిసెంబర్ 01న గ్రేటర్ ఎన్నికలకి పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడూ గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 04 న ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags:    

Similar News