Taraka Ratna: తారకరత్నను కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

Taraka Ratna: జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

Update: 2023-02-20 07:59 GMT

Taraka Ratna: తారకరత్నను కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

Taraka Ratna: ఫిల్మ్‌ఛాంబర్‌లో నందమూరి తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళుర్పిస్తున్నారు. కాసేపట్లో తారకరత్న అంతిమ యాత్ర మొదలు కానుంది. మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరపనున్నారు కుటుంబసభ్యులు.

గత నెల 27న కుప్పంలో లోకేష్‌ పాదయాత్రకు హాజరైన తారకరత్న నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుప్పంలో ఆసుపత్రికి, ఆ వెంటనే మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. తీవ్రమైన గుండెపోటుతో పడటంతోనే కోమాలోకి వెళ్లిపోయారు. అలా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహాశివరాత్రి పర్వదినాన అనంతలోకాలకు వెళ్లిపోయారు.

ఒకటో నెంబరు కుర్రాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన తారకరత్న దాదాపు 23 సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. నందమూరి తారక రామారావు నుంచి అబ్బిన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని ఏదో తాను చేసుకుపోయే రకమని చెప్పుకున్న తారకరత్నను మృత్యువు తన ఒడిలో చేర్చుకోవడం తెలుగు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Tags:    

Similar News