Taraka Ratna: శంకర్‌పల్లి మోకిలలోని నివాసంలో తారకరత్న పార్థివదేహం
Taraka Ratna: కన్నీరుమున్నీరవుతున్న తారకరత్న కుటుంబసభ్యులు
Taraka Ratna: తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ నటులు, దర్శకులు విచారం వ్యక్తం చేశారు. తారకరత్న లేరన్న విషయం నమ్మలేకపోతున్నానని, మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు తారకరత్న భౌతికకాయానికి ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. మోకిలలోని తారకరత్న ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న మృతిపై విజయసాయి స్పందిస్తూ 'సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు. తారకరత్న ఇంటకి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేరుకున్నారు. తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించారు.