పిజ్జా ఆర్డర్ చేస్తే... అడల్ట్‌ గ్రూప్స్‌లో ఫోన్ నెంబర్ పెట్టాడు!

Update: 2020-02-27 16:10 GMT

పిజ్జా ఆర్డర్ చేసిన పాపానికి ఓ నటి నెంబర్ ని తీసుకువెళ్ళి అడల్ట్స్ గ్రూప్‌లో పెట్టాడు ఓ డెలివరీ బాయ్.. దీనితో వరుస కాల్స్ రావడం, అసభ్యకరమైన సందేశాలు రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. తమిళ నటి గాయత్రి సాయి బుధవారం డోమినోస్‌ పిజ్జా డెలివరీ బాయ్‌పై పోలీసులకి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ నెంబర్ ని అసభ్యకర గ్రూప్‌లలో పోస్ట్ చేసి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వివరించారు.

ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల (ఫిబ్రవరి 9న) చెన్నైలోని నటి గాయత్రి ఇంటికి డోమినోస్‌ ఓ డెలివరీ బాయ్‌ పిజ్జా తీసుకుని వచ్చాడని గాయత్రి సాయి చెప్పుకొచ్చారు. అనంతరం తన ఫోన్ నెంబర్‌ను అతను అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడని, దీంతో విపరీతమైన ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయని గాయత్రిసాయి వెల్లడించారు. దీనిపైన అతని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అది పెండింగ్‌లోనే ఉందని ఆమె పేర్కొన్నారు .

వేధింపులు ఎక్కువ కావడంతో సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరానని, తన నెంబర్‌ ఇతరులకు షేర్‌ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుడా మెసేజ్‌లను స్ర్కీన్‌ షాట్‌లను కూడా ఆమె ట్విట్టర్ లో పొందు పరిచారు.. ఆమె ఫిర్యాదు మేరకు తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనిపైన పోలిసులు స్పందిస్తూ.. సదరు పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

ఇక గాయత్రి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన అంజలి చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. 


Tags:    

Similar News