వైద్య బృందానికి తమన్నా థాంక్స్!

Tamannaah Bhatia Thanks : సినీ నటి తమన్నా కరోనా బారిన పడి కోలుకున్నసంగతి తెలిసిందే.. స్వల్పంగా జ్వరం రావడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా, అందులో కరోనా పాజిటివ్‌ అని తేలింది.

Update: 2020-10-18 11:43 GMT

Tamannaah Bhatia Thanks : సినీ నటి తమన్నా కరోనా బారిన పడి కోలుకున్నసంగతి తెలిసిందే.. స్వల్పంగా జ్వరం రావడంతో ఆమె పరీక్షలు చేయించుకోగా, అందులో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీనితో నానక్‌రాంగూడ లోని ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరి అక్కడే చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు తమన్నా. అయితే ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు " వైద్యులు, నర్సులు, సిబ్బందికి నేను ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేను తీవ్ర ఆరోగ్యానికి గురి అయ్యాను. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం నన్ను బాగా చూసుకున్నారు. ధైర్యం చెప్పారు. వారి కేరింగ్ వల్లే నేను కోలుకున్నాను" అని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోని పోస్ట్ చేసింది తమన్నా.. ఇక అంతకుముందు తమన్నా తల్లిదండ్రులకి కూడా కరోనా సోకినా సంగతి తెలిసిందే..

ఇక తమన్నా సినిమాల విషయానికి వచ్చేసరికి హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న 'సిటీమార్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె కబడ్డీ కోచ్ గా తమన్నా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా సత్యదేవ్ హీరోగా వస్తున్న 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలు చేసేందుకు కూడా తమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్ లుగా వస్తున్న అంధధూన్ రీమేక్‌ లో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటిస్తోంది తమన్నా... ఈ పాత్రకి గాను తమన్నా కోటిన్నర డిమాండ్ చేసిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.


Tags:    

Similar News