Sushant Singh Rajput Suicide: సుశాంత్ కేసులో కీలక పరిణామం .. రియాపై కేసు పెట్టిన సుశాంత్ తండ్రి!
Sushant Singh Rajput Suicide: బాలీవుడ్ యవ సంచలనం, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Sushant Singh Rajput Suicide: బాలీవుడ్ యవ సంచలనం, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పైన సుశాంత్ తండ్రి కేకే సింగ్కేసు పెట్టారు. ఆర్ధికంగా రియా చక్రవర్తి సుశాంత్ ని వాడుకుందని, అంతేకాకుండా మానసిక క్షోభకు కూడా గురి చేసిందని అయన ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాట్నా పోలీసులు రియా చక్రవర్తి పైన పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టుగా వెల్లడించారు.
అయితే ఇన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విమర్శలు చేయని సుశాంత్ కుటుంబం ఇప్పుడు రియాపైన సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక అటు రియా చక్రవర్తి ఈ నెల ప్రారంభంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తుకు చేపట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోరింది.
ఇక సుశాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు 40 మంది తమ వాంగ్మూలాలను నమోదు చేశారు పోలీసులు.. ఇందులో దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు ముఖేష్ ఛబ్రా, చిత్ర నిర్మాత శేఖర్ కపూర్, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ తదితరులు ఉన్నారు.
అటు మంచి యువ నటుడిగా ప్రశంసలు అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబైలోని బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2013 లో "కై పో చే" చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2015 లో "డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి!", "ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ", "సోంచిరియా" మరియు "చిచోర్" చిత్రాలలో ఆయన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా అయన నటించిన 'దిల్ బెచరా' చిత్రం ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.