Sushant Singh Rajput Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Sushant Singh Rajput Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులకు ఆదేశించింది. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ 'సీబీఐ జయహో' అంటూ ట్వీట్ చేశారు.
కాగా జూన్ 14లో సుశాంత్ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. సీబీఐ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు ఫైల్ చేసేందుకు సీబీఐకి అవకాశం కల్పించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది.