వారిసూ విషయంలో దిల్ రాజు కి మద్దతు పలికిన సురేష్ బాబు
* ఒక రకంగా ఈ సినిమా విషయంలో దిల్ రాజు రిస్క్ తీసుకుంటున్నారు అని చెప్పచ్చు.
Suresh Babu: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న "వారసుడు" సినిమా థియేటర్ ల విషయంలో డిస్ట్రిబ్యూటర్ లు అందరూ దిల్ రాజు పై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ డబ్బింగ్ సినిమాల కంటే డైరెక్ట్ తెలుగు సినిమా లు అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకు సంక్రాంతి సమయంలో ప్రాధాన్యత ఉండాలని నిర్మాతల మండలి కూడా సీరియస్ గానే చెప్తోంది. అయితే తాజాగా ఇప్పుడు దిల్ రాజుకు మద్దతుగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ముందుకొచ్చారు.
"వారిసూ" కోసం థియేటర్ ల కేటాయింపు విషయంలో టాలీవుడ్ లో ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో మన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ మరియు పుష్ప వంటి తెలుగు సినిమాలు సరిహద్దులు దాటి తమిళ పరిశ్రమ నుండి కూడా మద్దతు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు సురేష్ బాబు. అలాగే తమిళ విడుదలలకు కూడా టాలీవుడ్ అనుగుణంగా ఉండాలని, "పుష్ప 2" విడుదల మాదిరిగా తెలుగు సినిమాలను పాన్-ఇండియా విడుదల చేస్తున్నట్టే తమిళ పరిశ్రమ కూడా అదే చేస్తుందని సురేష్ బాబు అన్నారు. "ఇది కొత్త పద్దతి. మనమందరం దానిని అంగీకరించాలి.
ఈ విషయంలో అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదు'' అని సురేష్ బాబు అన్నారు. మరోవైపు అజిత్ "తునివు" ఓవర్సీస్ హక్కులు విజయ్ వారిసూ తో పోలిస్తే కేవలం 1/3 వంతుకు అమ్ముడయ్యాయి. దానికి కారణం నైజాం ప్రాంతంలో దిల్ రాజు ఉన్న నెట్వర్క్. ఏదేమైనా ఒక రకంగా ఈ సినిమా విషయంలో దిల్ రాజు రిస్క్ తీసుకుంటున్నారు అని చెప్పచ్చు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.