అభిమాన దర్శకుడికి సూపర్ స్టార్ బర్త్ డే విషెస్!
ఇండస్ట్రీలో హిట్ కొట్టడం అనేది చాలా కష్టం కానీ వరుసగా హిట్లు కొట్టడం అంటే అది మామలు విషయం కాదు. కానీ వరుసగా ఎలాంటి ప్లాప్స్ లేకుండా హిట్స్ కొట్టిన దర్శకులు కొందరే ఉన్నారు.
Mahesh Babu Birthday wishes Director Anil Ravipudi : ఇండస్ట్రీలో హిట్ కొట్టడం అనేది చాలా కష్టం కానీ వరుసగా హిట్లు కొట్టడం అంటే అది మామలు విషయం కాదు. కానీ వరుసగా ఎలాంటి ప్లాప్స్ లేకుండా హిట్స్ కొట్టిన దర్శకులు కొందరే ఉన్నారు. అందులో రాజమౌళి, కొరటాల శివ ఉన్నారు. అలాంటి వారి సరసన యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడికి చేరిపోయాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2,సరిలేరు నీకెవ్వరు ఇలా వరుసగా ఐదు విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు టాలీవుడ్ లో హీరోలకి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు.
ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి నేడు 39 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా అనిల్ కి అభిమానులు, టాలీవుడ్ లోని ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే అనిల్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఆరంభంలో మహేష్, అనిల్ కాంబినేషన్ లో సరిలేరు నీకేవ్వరు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనిల్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ సమయంలో మహేష్ , అనీల్‌తో కేక్ కట్ చేయించి తినిపించాడు.
అదే ఫోటోను మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "కాలం ఎంత తొందరగా గడుస్తుంది. నిన్నటిలానే ఉంది. నా అభిమాన దర్శకులలో ఒకరు అయిన అనీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు . మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆనందం మరియు విజయం లభిస్తుందని కోరుకుంటున్నాను" అని మహేష్ ట్వీట్ చేశారు. దీనికి గాను అనిల్ ధన్యవాదాలు తెలిపాడు.
ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. ఇప్పటికే కథంతా సిద్దం అవ్వగా, త్వరలోన్ సెట్స్ పైకి వెళ్లనుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే!