Superstar Krishna: సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటున్న సూపర్ స్టార్
Superstar Krishna: విలక్షణ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గత 59 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లోనే ఉన్నారు.
Superstar Krishna: విలక్షణ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గత 59 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ లోనే ఉన్నారు. యాక్టర్ గా మాత్రమే కాక ఒక నిర్మాతగా కూడా విజయవంతమైన జీవితాన్ని ఆస్వాదించిన కృష్ణ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోలలో ఒకరైన కృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 78 ఏళ్ల కృష్ణ ఆఖరిసారిగా 2016 లో విడుదలైన "శ్రీ శ్రీ" అనే సినిమాలో కనిపించారు. ఆ తరువాత అక్కడక్కడా ఇంటర్వ్యూలు లేదా మహేష్ బాబు సినిమా ఈవెంట్లలో తప్ప కృష్ణ వెండితెరపై ఎప్పుడూ కనిపించలేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నేను నా కెరియర్లో చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను ఇప్పుడు హ్యాపీ గా రిటైర్ అయిపోయి సినిమాల గురించి ఆలోచనలు చేయడం లేదు," అని కరాఖండిగా చెప్పేశారు సూపర్ స్టార్. ఏదైనా సినిమాలో గెస్ట్ పాత్రలో కానీ స్పెషల్ రోల్స్ కానీ వస్తే చేస్తారా అని అడిగినా కృష్ణ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. క్యామీయో రోల్స్ చేయాలన్నా ఇంట్రెస్ట్ లేదు అని కొట్టిపారేశారు. "అసలు నా అభిమానులు కూడా నన్ను అలాంటి పాత్రలో చూడాలి అనుకోరు. ఎప్పుడైనా అలా కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రలో కనిపించినా వారు మాత్రం అలాంటి పాత్రలు వద్దు అని రిక్వెస్ట్ చేసేవారు," అని చెప్పిన కృష్ణ తను ఇకపై సినిమాల్లో నటించేది లేదు అని స్పష్టం చేశారు.