Kapatadhaari Movie Review: సుమంత్ 'కపటదారి' మూవీ రివ్యూ

హీరో సుమంత్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తిపును సంపాదించుకున్నాడు.

Update: 2021-02-19 11:40 GMT

కపటధారి మూవీ ఫైల్ ఫోటో


హీరోగా నిలదొక్కుకోవడానికి సుమంత్ అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చాలా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తిపును సంపాదించుకున్నాడు. గతంలో వరుస ప్రేమకథా చిత్రాలు చేసి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు థ్రిల్లర్‌ కథలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో'కపటధారి' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్‌. కన్నడ సూపర్‌ హిట్‌ 'కవలుధారి' సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుంది?.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుమంత్‌కు ఈ సినిమా హిట్‌ అందించిందా? చూద్దాం..

కథ

సుమంత్ ఈ సినిమాలో గౌతమ్ అనే ట్రాఫిక్ ఎస్ఐ గా కనిసిస్తాడు. కానీ, ఆ జాబ్ తో అతను సంతృప్తి చెందడు. పోలీసుగా విధుల్లో చేరి క్రైమ్‌ కేసులను విచారించాలని అనుకుంటాడు. అతను చాలా ప్రయత్నించినా..పై అధికారులు మాత్రం ప్రమోషన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు. ఇంతలో ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాలల్లో ఓ ముగ్గురి అస్థిపంజరాలు బయటపడతాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని తూతూ మంత్రంగా విచారణ చేసి.. కేసును మూసేసే ప్రయత్నం చేస్తారు. కానీ, గౌతమ్‌ మాత్రం సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఈ క్రమంలో జర్నలిస్ట్‌ గోపాల్‌ కృష్ణ (జయప్రకాశ్), నలభై ఏళ్ల క్రితం ఆ కేసును డీల్‌ చేసిన రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజన్ ‌(నాజర్‌), గౌతమ్ కు పరిచయం అవుతారు. ఈ కేసుకు సంబంధించి ఆలేరు శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్‌ ఎవరు? అతనికి ఈ కేసుకు ఉన్న సంబంధం ఏమిటి? అస్థిపంజరాలు ఎవరివి? వాళ్లు ఎలా చనిపోయారు? ఈ క్రమంలో గౌతమ్‌ ఈ కేసును ఎలా ఛేదించాడనేది మిగతా కథ.

ఎవరెలా నటించారంటే..

ట్రాఫిక్‌ ఎస్ఐ గౌతమ్‌ పాత్రలో సుమంత్‌ అలరించాడు. కొన్ని చోట్ల ఎమోషనల్‌ సీన్లను కూడా బాగా పండించాడు. రిటైర్డ్‌ పోలీసు అధికారి రంజిత్‌ పాత్రకు నాజర్ ప్రాణం పోశాడు. హీరోతో సమానంగా స్ర్కీన్‌ లో కనిపిస్తాడు. నాజర్ అనుభవం అంతా తెరపై కనబడుతుంది. ఇక జరల్నిస్టుగా జయప్రకాశ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ తనదైన పంచ్‌లతో నవ్విస్తాడు. హీరోయిన్‌ నందిత, సుమన్ రంగనాథన్, విలన్‌గా చేసిన సతీష్‌ కుమార్‌ తమ పరిధిమేరకు నటించారు.

కన్నడ, తమిళ భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని 'కపటధారి'గా తెలుగులో రిలీజైంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు మెండుగా ఉండటం సినిమాకి చాలా ప్లస్‌ అయింది. దర్శకుడు ప్రదీప్‌ కృష్ణమూర్తి థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన ఫీల్‌ని క్రియేట్‌ చేయగలిగాడు. కానీ, ఎమోషనల్‌ అంశాలను మరచిపోయినట్లున్నాడు. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్లు రిపీట్‌ కావడం ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. ఈ

సినిమాకు ప్రధాన బలం సిమోన్ కె కింగ్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు అతను ప్రాణం పోశాడు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Tags:    

Similar News