ప్రమోషన్ల కోసం అవతార్ సినిమాని వాడేస్తున్న సుకుమార్
* అల్లు అర్జున్ తో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నీవేశానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేశారు.
Director Sukumar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ అయిన "పుష్ప: ది రూల్" కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫాహాధ్ ఫాసిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ "అవతార్ 2" తో అటాచ్ అయి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య అతి త్వరలోనే "అవతార్: ది వే ఆఫ్ వాటర్" సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నీవేశానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ ని "అవతార్ 2" థియేటర్లలో వెయ్యాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల కాబోతోంది ప్రపంచవ్యాప్తంగా "పుష్ప: ది రూల్" సినిమాపై క్రేజ్ పెరగడానికి ఇది చాలా మంచి స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే "అవతార్" సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. "అవతార్" సినిమాపై ఉన్న క్రేజ్ ని "పుష్ప" చిత్ర బృందం కూడా ఉపయోగించుకోవాలి అని అనుకుంటుంది. ఇక "అవతార్" థియేటర్లలో అల్లు అర్జున్ ని చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.