Bigg Boss 7 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌‌లో ఊహించని ట్విస్ట్.. బైబై చెప్పిన శుభశ్రీ, గౌతమ్.. కానీ!

Bigg boss 7 Telugu: ‘ఉల్టా పుల్టా’ అంటూ షురువైన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss 7 telugu)లో ఆదివారం ఎవరూ ఊహించని విధంగా మారింది.

Update: 2023-10-09 02:47 GMT

Bigg Boss 7 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌‌లో ఊహించని ట్విస్ట్.. బైబై చెప్పిన శుభశ్రీ, గౌతమ్.. కానీ!

Bigg boss 7 Telugu: ‘ఉల్టా పుల్టా’ అంటూ షురువైన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss 7 telugu)లో ఆదివారం ఎవరూ ఊహించని విధంగా మారింది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌‌తో బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. ఐదోవారం అనుకున్నట్లుగా నటి శుభశ్రీ రాయ్‌గురు, నటుడు గౌతమ్‌ కృష్ణ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. కానీ, ఇక్కడే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. గౌతమ్‌ కృష్ణను సీక్రెట్‌ రూంలోకి ఉంచాడు. అంటే మరోసారి ఈయన ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఐదో వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు.

వీరిలో గౌతమ్‌ కృష్ణ, శివాజీ, శుభశ్రీ, ప్రియాంక, టేస్టీ తేజ, ప్రిన్స్‌ యావర్‌, అమర్‌దీప్‌లు ఉన్న సంగతి తెలిసిందే. వీరిందరినీ డార్క్‌ రూమ్‌లోకి పంపిన నాగర్జున.. ఎలిమినేట్‌ అయినవాళ్లు మాత్రమే బయటకు వస్తారంటూ తెలిపాడు. ఆడియోన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన శుభశ్రీ.. ఈవారం ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్ నాగ్ ప్రకటించాడు.

హౌస్ నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ (Subhashree Rayaguru) నాగర్జునతో తన అనుభవాలను పంచుకుంది. అలాగే హౌస్ మేట్స్‌తో సరదాగా మాట్లాడింది. బిగ్‌బాస్‌ హౌస్‌ను తాను ఎంతో మిస్‌ అవుతున్నానని చెప్పింది. హౌస్‌మేట్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

Tags:    

Similar News