Kangana Ranaut Join's In BJP : బీజేపీ వైపు చూస్తున్న కంగనా రనౌత్?
Kangana Ranaut Join's In BJP : బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ కంగనా రనౌత్.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర సర్కార్ పై, ముంబై పోలిసుల పైన
Kangana Ranaut Join's In BJP : బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ కంగనా రనౌత్.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర సర్కార్ పై, ముంబై పోలిసుల పైన కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది కంగనా. తాజాగా ముంబైలోని ఆమె ఆఫీస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉందని బీఎంసి అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై హైకోర్టు కంగనా ఆఫీసును కూల్చొదంటూ స్టే విధించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో పరిస్థితి ఒక్కసారిగా కంగానా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంగా మారిపోయింది. సీఎం ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి పలు కామెంట్స్ కూడా చేసింది కంగనా.. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ విరుచుకుపడింది.
అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేసింది కంగనా.. మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుతున్న ఇబ్బందులను చూసి మీ మనసు చలించడం లేదా? అని సోనియాను ప్రశ్నిచింది. ఎక్కడో విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్నారు. మీ మౌనం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. మీ సొంత ప్రభుత్వమే ఓ మహిళను తీవ్రంగా వేధిస్తోంది .. అంబేడ్కర్ మనకిచ్చిన ఆదర్శాలను పాటించాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని అభ్యర్థించలేరా? ఇప్పటికైన మీరు జోక్యం చేసుకుంటారని నేను ఆశిస్తున్నానని కంగనా ట్వీట్లు చేసింది.
ఇక ఇది ఇలా ఉంటే కంగనా తన ఫ్యామిలీతో కలిసి త్వరలో బీజేపీలో చేరనున్నట్టుగా ముంబై మీడియా కథనాలను వెల్లడిస్తుంది. త్వరలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని తీసుకోబోతోందని ఆ వార్తల సారాంశం.. తాజాగా మహారాష్ట్ర సర్కార్ పైన ఆమె చేసిన కొన్ని వాఖ్యలు దీనికి బీజం పోశాయి.. ఆమె చేసిన ఈ వాఖ్యలు పరోక్షంగా బీజేపీకి ఆనందాన్ని ఇచ్చాయి. అటు బీజేపీ కూడా కంగనాకి ప్రత్యక్షంగానే సహాయం కూడా చేసింది. భద్రత విషయంలో సహాయం కావాలని కంగనా కేంద్రాన్ని కోరగా వై లెవల్ సెక్యురిటీని ఇచ్చింది. అటు ఆమె ఆఫీస్ ని కూల్చడం పట్ల బీజేపీ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వెలువడుతున్నాయి. కానీ దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక గతంలో కంగనా తాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పని చేశారట!.