SS Rajamouli : RRR కోసం రాజమౌళి లొకేషన్స్‌ వేట?

SS Rajamouli : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం)..

Update: 2020-09-18 12:57 GMT

SS Rajamouli and wife Rama enjoy wildlife safari at Bandipur Tiger Reserve forest

SS Rajamouli : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే లాక్ డౌన్ వలన వాయిదా పడిన సినిమా షూటింగ్ ని త్వరలోనే రాజమౌళి మొదలు పెట్టనున్నారట.. తాజాగా రాజమౌళి తన భార్య రమాతో కలిసి కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌లో పర్యటించారు. మూడురోజుల పర్యటనలో భాగంగా అటవీ ప్రాంతంలోని ఎన్నో ప్రదేశాలను సందర్శించారు. అయితే ఇది కేవలం సాధారణ టూర్ మాత్రమేనా లేకా ఆర్.ఆర్.ఆర్ కోసం లోకేషన్ల వేటా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Tags:    

Similar News