Sreeleela: పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది

* పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం పొందిన రవి తేజ హీరోయిన్

Update: 2023-02-28 16:00 GMT

మెగా హీరో సరసన హీరోయిన్ గా మారనున్న శ్రీ లీల

Pawan Kalyan: ఈ మధ్యకాలంలో ఒక్క సూపర్ హిట్ సినిమాతోనే టాలీవుడ్ లో హీరోయిన్ లపై ఉండే క్రేజ్ పెరుగుతోంది. అలాంటిది ఏకంగా రెండు వరుస సూపర్ హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది శ్రీలీల. "పెళ్లి సందడి" సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమా తోనే మంచి హిట్ అందుకుంది. అప్పుడే మాస్ మహారాజా రవితేజ సరసన "ధమాకా" లో హీరోయిన్ గా నటించే అవకాశం కూడా దక్కించుకుంది.

"ధమాకా" సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరిపోవడం తో శ్రీలీల క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకుంది శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి "ఉస్తాద్ భగత్ సింగ్" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

"గబ్బర్ సింగ్" వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో లో రాబోతున్న రెండవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కోసం శ్రీలీల ను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం శ్రీలీల ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కెరీర్ మొదట్లోనే పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. మరి ఈ సినిమా శ్రీలీల కి ఎంతవరకు ఉపయోగ పడుతుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News