'చిత్రం' తేజానికి రెండు దశాబ్దాలు
తేజ గా పిలువబడే జాస్తి ధర్మ తేజ ఒక తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.
తేజ గా పిలువబడే జాస్తి ధర్మ తేజ ఒక తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత. ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దర్శక నిర్మాతగా మారాడు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.
తేజ బాల గురుకుల పాఠశాలలో చదివాడు. సినీ నటి జీవిత, నృత్య దర్శకురాలు సుచిత్ర చంద్రబోస్ ఈయన ఒకే తరగతిలో చదువుకున్నారు. దర్శకుడు శంకర్ ఈయనకు సీనియరు. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె ఇతనికి రామాయణ, మహాభారత, భాగవతాలను కథలుగా చెప్పేది. తర్వాత చెన్నై నుంచి హైదరాబాదు వచ్చాడు. కొద్ది రోజులు పోస్టరు ఇన్ ఛార్జ్ గా పనిచేశాడు.
తర్వాత కెమెరా సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడు టి. కృష్ణ ఇతన్ని బాగా చూసుకునే వాడు. ఛాయా గ్రాహకులు రవికాంత్ నగాయిచ్, ఎస్. గోపాల రెడ్డి, మహీధర్ దగ్గర కొద్ది రోజులు సహాయకుడిగా పనిచేశాడు. రాం గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడి శివ సినిమాకు మొదటి నుంచి చివరి వరకు అనేక విభాగాల్లో పనిచేశాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో ఛాయాగ్రాహకుడిగా మారాడు. నిజం సినిమాకు గాను నంది ఉత్తమ దర్శకుడు పురస్కారము, నంది ఉత్తమ స్క్రీన్ ప్లే పురస్కారము, ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారము
చిత్రం సినిమాతో తెరంగేట్రం చేసిన తేజ కెరీర్‌లో మంచి సినిమాలు తెరకెక్కించారు. చిత్రం, జయం, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఆయన కెరీర్‌లో బంపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం తేజ రానా హీరోగా 'రాక్షసరాజు రావణాసురుడు', గోపీచంద్ హీరోగా ' అలివేలు వెంకటరమణ', వంటి చిత్రాలను తెరక్కిస్తున్నాడు. ఈ రండు సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చిత్రం జూన్ 16,2020న విడుదల కాగా నేటితో ఈ చిత్రం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఊహల పల్లకీలో.., ఢిల్లీ నుంచి గల్లీ దాకా.., కుక్క కావాలి వంటి పాటలు శ్రోతలని ఎంతగానో అలరించాయి. నేటితో చిత్రం సినిమా 20 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు దర్శకుడు తేజ తన సినీ ప్రయాణంలో దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ కురుస్తుంది.