SP Charan on SP Balasubrahmanyam's health: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి గత 5 రోజులుగా ఆందోళనకరంగా మారింది. అయితే మంగళవారం ఆయన కోలుకున్నట్టుగా వార్తలు రావటంతో అభిమానులు కాస్త స్థిమిత పడ్డారు. అయితే తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని వెంటిలేటర్‌పై నుంచి తీశారని వస్తోన్న వార్తలు అవాస్తవమని ఎస్పీ చరణ్ తెలిపాడు.
అలాంటి ఓ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. మా నాన్న గారి పరిస్థితి నిన్నటిలానే ఉంది. దయచేసి రూమర్లను రాయకండని విన్నవించుకున్నాడు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. ఇలాగే మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు అని ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, గాయకులు ఆకాంక్షిస్తున్నారు.