Keedaa Cola: SPB వాయిస్ రీక్రియేట్.. ‘కీడా కోలా’ టీమ్‌కి రూ.కోటి నష్టపరిహారం.!
Keedaa Cola: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 16 భాషలలో 40000 పైగా పాటలు పాడి అయన స్వరంతో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
Keedaa Cola: లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 16 భాషలలో 40000 పైగా పాటలు పాడి అయన స్వరంతో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా వుంటే గత సంవత్సరం నవంబర్ 03న తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ మూవీ మంచి విజయం అందుకుంది. ఇపుడు ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి వాయిస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సాయంతో రీ క్రియేట్ చేసి కీడా కోలా సినిమాలో వాడుకున్నందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు. అయితే తాజాగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ వివాదంపై ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందిస్తూ.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కుటుంబం తో అనుమతి తీసుకోకుండా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ను వాడుకున్నందుకు గాను కీడా కోలా టీమ్ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం పైన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎలా స్పందిస్తారో చూడాలి.