SP Balasubrahmanyam Health Bulletin : నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది : ఎస్పీ చరణ్

SP Balasubrahmanyam Health Bulletin : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

Update: 2020-09-03 13:15 GMT

SP Balasubrahmanyam

SP Balasubrahmanyam Health Bulletin : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 ఆసుపత్రిలో చేరిన ఆయన, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే అయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు దేవుడిని కోరుకుంటున్నారు. అయితే తాజాగా అయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని అయన పంపించారు.

ఆ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని, అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలతో కోలుకుంటున్నారని అన్నారు. సోమవారానికి శుభవార్త వినబడుతుందన్న విశ్వాసం బలంగా ఉందని చరణ్ పేర్కొన్నారు.. అటు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పైన ఎంజీఎం ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ హెల్త్ బులిటెన్ లో ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది.. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా అందులో పేర్కొంది.



Tags:    

Similar News