SP Balasubrahmanyam Funerals : ఇక సెలవు.. ముగిసిన బాలు అంత్యక్రియలు!
SP Balasubrahmanyam Funerals : దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళులతో ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి
SP Balasubrahmanyam Funerals : దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళులతో ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. దీనికంటే ముందు బాలు కుటుంబ సభ్యులు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాలు అంతిమ సంస్కారాలకి హాజరయ్యారు.. తమ అభిమాన గాయకుడిని చివరిసారిగా చూసేందుకు అటు అభిమానులు పోటెత్తారు. ఇక మా బాలు లేడని కన్నీటి పర్యంతం అయ్యారు..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు.. అక్కడ అయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ అయన ఆరోగ్య స్థితిలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అయన శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దాదాపుగా పదహారు భాషలలో నలబై వేలకి పైగా పాటలు పాడారు ఎస్పీ బాలు.. అయన మరణం భారతీయ సినిమాకే తీరని లోటని చెప్పాలి.
బాలు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.