SP Balu: వాయిస్‌ మెచ్చూర్డ్‌గా లేదు పొమ్మ‌న్నారు..మూడేళ్ల త‌ర్వాత ఆహ్వానం

SP Balu: తండ్రి వేసిన 'భక్త రామదాసు' నాటకంలో రామదాసు కొడుకు వేషం వేసి, చక్కని పాటలు పాడి ప్రేక్షకుల్ని మెప్పించారు.

Update: 2021-06-04 10:58 GMT

ఎస్పీ బాల సుభ్రమణ్యం (ఫోటో ది హన్స్ ఇండియా)

SP Balu: ఆ స్వ‌రం కొన్ని వేల గొంతుల‌ను ప‌లికిస్తుంది. ఆయ‌న పాట ఎంతో మంది హృద‌యాల‌ను క‌దిలిస్తుంది. ఆయ‌న పాడిన పాట ప్ర‌తి ఇంట్లో మారుమోగుతోంది. గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. పాటకి, మాటకి, మంచి వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచారు. చలనచిత్ర పరిశ్రమలో 45 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయన గత ఏడాది కరోనాతో పోరాడి పరమపదించారు. నేడు ఆయన 75వ జయంతి. శ్రీపతి పండితారాధ్యుల వంశంలో పుట్టిన బాల సుబ్రహ్మణ్యాన్ని తెలిసిన వారంతా 'బాలు' అని పిలుస్తుంటే, ఆప్తమిత్రులు మాత్రం 'మణి' అని పిలుస్తుండేవారు.

Full View

బాలుకు చిన్న‌తనంలో కళారంగ‌లోకి అడుగుపెట్టారు. సంవత్సరాల వయసులోనే తండ్రి వేసిన 'భక్త రామదాసు' నాటకంలో రామదాసు కొడుకు వేషం వేసి, చక్కని పాటలు పాడి ప్రేక్షకుల్ని మెప్పించారు. నాటకాలలో వేషాలు వేస్తూ, స్టేజీ మీద పాటలు పాడారు. మద్రాస్‌ జీవితమే బాలు జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. మద్రాసులో మిత్రులతో కలిసి పాటలు పాడుతూ, పోటీలతో పాల్గొంటూ, తనకు తెలియకుండానే తన జీవిత సౌభాగ్యానికి పునాదులు వేసుకున్నారు.

Full View

1963లో మద్రాస్‌ సోషల్‌ కల్చరల్‌ క్లబ్‌లో పాటల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో బాలు కూడా పాల్గొన్నారు. ఆనాటి పోటీలకు ఘంటసాల వెంకటేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ రోజు ఆ ఉత్సవానికి సంగీత దర్శకుడు కోదండపాణి కూడా వచ్చారు. పోటీలో బాలు వాణి విజృంభించి విన్యాసాలు చేసింది. హాజరైన సినీ సంగీత ప్రముఖుల ప్రశంసలతోపాటు బహుమతి కూడా గెలుచుకున్నారు. బాలు గాత్ర మాధుర్యం కోదండపాణిని ఆకర్షించింది. బాలుని ప్రశంసించడమే కాకండా సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని కూడా మాటిచ్చారు.

Full View


కోదండపాణి బాలుని 18 ఏళ్ల వయసులో నిర్మాత భావనారాయణ ఆఫీసుకి తీసుకెళ్లి పరిచయం చేశారు. బాలు పాడిన పాట విన్నారాయన. వాయిస్‌ మెచ్చూర్డ్‌గా లేదని తర్వాతి చిత్రంలో ప్రయత్నిద్దామని చెప్పారు. బాలు నిరాశ పడ్డారు. కోదండపాణి మాత్రం బాలుని మరచిపోలేదు. మూడేళ్ల త‌ర్వాత‌ 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రం తెరకెక్కిస్తున్న సమయమది. పద్మనాభం బాలు పాట విని గొంతు నచ్చిందన్నారు. సుశీలతో కలిసి 'ఏమి ఈ వింత మోహము' అనే పాట పాడారు. ఆ పాట కోదండపాణితోపాటు అందరికీ నచ్చింది. ఆనాడే బాలు గొప్ప గాయకుడు అవుతాడని ఊహించారట. బాలు లేక పోయిన ఆయ‌న పాట‌లు ఎప్ప‌టికి మన మ‌దిలోనే ఉంటాయి.

Full View


Tags:    

Similar News