Sonu sood : విద్యార్దినికి, క్రీడాకారుడికి అండగా నిలిచిన సోనూసూద్!
Sonu sood : కష్టం, సహాయం అనే మాటలు వినిపిస్తే చాలు అక్కడ క్షణంలో వాలిపోతున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్.. లాక్ డౌన్ టైంలో
Sonu sood : కష్టం, సహాయం అనే మాటలు వినిపిస్తే చాలు అక్కడ క్షణంలో వాలిపోతున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్.. లాక్ డౌన్ టైంలో వలసకూలీలకి ఆదుకొని వారి పాలిట దేవుడు లాగా నిలిచిన సోనూసూద్ ఇంకా ఎదుటివారికి అండగా నిలుస్తూనే వస్తున్నాడు.. సినిమాల్లో అయన విలన్ అయినప్పటికీ ఇప్పుడు సోనూసూద్ రియల్ హీరో.. ఇప్పటికి చాలా మందికి అండగా నిలిచిన సోనూసూద్ తాజాగా ఓ క్రీడాకారుడికి, సివిల్స్ పరీక్షలకు సిద్దం అవుతున్న మరొకరికి అండగా నిలిచారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గోవింద్ అగర్వాల్ అనే యువకుడు తన సోదరి ఐఏఎస్‌కు సిద్దం అవుతుందని, దానికి సంబంధించిన పుస్తకాలను తమ తండ్రి ఏర్పాటు చేయలేకపోయారన్నారని దానికి సహాయం చేయాలనీ కోరాడు.. అయితే మాది వ్యవసాయ కుటుంబం కావడంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడని వెల్లడించాడు.. అయితే దీనిపైన స్పందించిన సోనూ ''మీ పుస్తకాలు మీకు రేపటికల్లా అందుతాయి.'' అని హామీ ఇచ్చారు.. హామీ ఇచ్చినట్టుగానే తన మాటను నిలబెట్టుకున్నాడు సోనూసూద్..
ఇక మరో యువకుడు మనోజ్ అనే వ్యక్తి ఓ అథ్లెట్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే తనకి రన్నింగ్ షూ తనవద్ద లేకపోవడంతో తన స్నేహితులను అడిగి తెచ్చుకునేవాడట. అయితే ప్రపంచ స్థాయిలో ఆడే సత్తా తనలో ఉన్నప్పటికీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేదని సహాయం చేయాలనీ సోనూసూద్ ని కోరారు. అయితే దీనిపైన స్పందించిన సోనూసూద్ ''డన్ భాయీ... ఈ రోజు షూ అందుతాయి...'' అంటూ ట్విటర్‌లో వెల్లడించాడు. దీనితో సోషల్ మీడియాలో సోనుసూద్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది.
Your books will reach you by tomorrow ❣️🙏 https://t.co/8Ad2JR5IUo
— sonu sood (@SonuSood) August 31, 2020
It's done bhai . Will be delivered today 👍 https://t.co/ytqh67j4MP
— sonu sood (@SonuSood) August 31, 2020