Sonu Sood about Software Employee Sharadha: సాఫ్ట్ వేర్ శారద గురించి సోనూసూద్ మాటల్లో..

Sonu Sood about Software Employee Sharadha: లాక్ డౌన్ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు. అందులో భాగంగా వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి

Update: 2020-07-28 09:09 GMT
Sonu Sood about Software Employee Sharadha Selling Vegetables

Sonu Sood about Software Employee Sharadha : లాక్ డౌన్ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు. అందులో భాగంగా వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి హైదరాబాదులో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. అయినప్పటికీ తానూ మాత్రం దైర్యాన్ని కోల్పోలేదు. కుటుంబ పోషణకి గాను మార్కెట్‌లో ఉండి కూరగాయల వ్యాపారం చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మీడియా అనేక రకాల కథనాలని వెల్లడించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది పలువురు రాజకీయ నాయకులు ఆమెను పలకరించారు. అంతే కాకుండా కష్టం ఉంది అంటేనే చలించి పోతున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా దీనిపైన స్పందించాడు.

అయితే తాజాగా HMTVఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయలను పంచుకున్నాడు సోనూసూద్. అందులో భాగంగా సాఫ్ట్ వేర్ శారద గురించి అయన మాట్లాడుతూ.. శారద చాలా తెలివైన అమ్మాయి. ఆమె మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న విజివల్స్ ని నేను చూశాను. ఇక ఉద్యోగం పోతే మానసికంగా ఎంతో క్రుంగిపోతున్న చాలా మందికి శారద ఆదర్శం అని సోనూసూద్ అన్నాడు. హైదరాబాదులో ఉన్న తన టీంతో కలిసి వివరాలు తెలుసుకున్నామని ఆమెకి కచ్చితంగా సహాయం చేసి మళ్ళీ శారదను ఉన్నత స్థాయికి చేరుకుంటుందని సోనూసూద్ అన్నారు.  


Full View


Tags:    

Similar News