సోనమ్ నీ భర్త అందంగా ఉండడు.. నెటిజన్ కు నటి ఘాటుగా జవాబు!
Sonam Kapoor : తన భర్త ఆనంద్ అహుజా అందంగా ఉండడని ఓ అమెరికన్ ఇన్ఫుఎన్సర్ చేసిన వాఖ్యలకు నటి సోనమ్ కపూర్ ఘాటుగా సమాధానం
Sonam Kapoor : తన భర్త ఆనంద్ అహుజా అందంగా ఉండడని ఓ అమెరికన్ ఇన్ఫుఎన్సర్ చేసిన వాఖ్యలకు నటి సోనమ్ కపూర్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది సోనమ్ కపూర్.. . 'నువ్వు ఈ మెసేజ్ చదవవని నాకు తెలుసు. నువ్వు తప్పుడు ఆరోపణల గురించి, మహిళా సాధికారిత గురించి మాత్రమే మాట్లాడుతావు. నీలాంటి మహిళ సమాజంలో నెగిటివిటీని వ్యాప్తి చేస్తుంది.
మీ నాన్న లేకపోతే నువ్వు శూన్యం. నీ లాంటి నటీమణులకు భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషంగా ఉంది. నీకు కనీసం నటించడం కూడా రాదు. పూర్తిగా బంధుప్రీతి నుంచి వచ్చిన నటివి నీవు. మరో విషయం.. నీ భర్త చాలా బాగుంటాడని నువ్వు అనుకుంటున్నావా? మరోసారి ఆయన్ను చూడు ఎంత అందవిహీనంగా ఉన్నారో తెలుస్తుంది' అని సదరు మహిళ వాఖ్యలు చేసింది.
అయితే ఈ వాఖ్యాల పైన సోనమ్ స్పందిస్తూ.. "ఇలాంటి సందేశాన్ని పంపించి నువ్వు ఫాలోవర్స్‌ను సంపాదించాలి అనుకున్నావు. అంతేకాకుండా నా దృష్టిలో పడటానికి ఇది పంపించావు అని నాకు తెలుసు. ప్రజల మొదళ్లు ఇలా పనిచేస్తున్నాయేంటి? ఆమె వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆమె చేసిన ఈ వాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి.. ఇంతటి ద్వేషం వారినే నాశనం చేస్తుంది " అని సోనమ్ కపూర్ ఘాటుగా స్పందించింది.
అయితే సోనమ్ వాఖ్యాల పట్ల సదరు మహిళ తిరిగి స్పందించింది.. వాస్తవానికి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని వెల్లడించింది.. అవి ద్వేషపూరితమైన సందేశాలు వచ్చి ఉంటే అవి నేను చేసినవి కావని ఇప్పుడే తన ఇన్స్టాగ్రామ్ తన అధినంలోకి వచ్చినట్టుగా వెల్లడించింది. అలాంటి ద్వేషపూరితమైన సందేశాలను పంపను అని వెల్లడించింది.