Movie News: మధుమితకు శివ బాలాజీ బ్రేకప్.. ఎందుకంటే..?!
Breakup: జాతకాలు బాగోలేదని చెప్పడంతో నాలుగేళ్లు ప్రేమించిన మధుమితకు శివబాలాజీ బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత చేసిన తప్పు తెలుసుకొని..మధుమితకు దగ్గరయ్యేందుకు శివబాలాజీ...
Breakup: లవ్ స్టోరీ అన్నాక చాలా ట్విస్టులు ఉంటాయి. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇది కామన్..ఇక సెలబ్రిటీ కపుల్స్ ప్రేమ కథల్లో ఉండే ట్విస్టులంటే అందరికీ ఆసక్తే కదా..తమ లైఫ్ లో జరిగిన అలాంటి ఇంట్రెస్టింగ్ మేటర్ ని టాలీవుడ్ క్యూట్ కపుల్ శివబాలాజీ-మధుమిత ఫ్యాన్స్ కి షేర్ చేశారు.
శివబాలాజీ-మధుమితలకు 2009లో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒక ఇంటివారయ్యారు. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదట..వీరి స్టోరీలో కూడా ఒక విలన్ పాత్ర ఉందట..పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాక...శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడట..అందుకు కారణం శివ బాలాజీకి తన తల్లి మీద ఉన్న ప్రేమే కారణమట.
విషయం ఏంటంటే..మధుమితను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాక శివ బాలాజీ ఆ విషయాన్ని తన ఇంట్లో చెప్పాడు. వీరి పెళ్లికి వాళ్లు అంగీకరించారు. మధుమిత సైతం తన ఇంట్లో శివ బాలాజీని ప్రేమిస్తున్నానని..అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మధుమిత నిర్ణయాన్ని ఆమె పుట్టింటి వారు స్వాగతించారు. అయితే ఇక్కడే విలన్ ఎంట్రీ జరిగింది. అది కూడా జాతకాల రూపంలో..ఇరువురి జాతకాలను చూపిస్తే..మధుమితను పెళ్లాడితే..తల్లిని కోల్పోతావంటూ జాతకాలు చూసిన పండితులు చెప్పాడట. దీంతో తల్లి మీద ఉన్న ప్రేమలో తన ప్రియురాలికి శివ బాలాజీ బ్రేక్ అప్ చెప్పేశాడట..ఇక అప్పటి నుంచి వీరి మధ్య మాటలు లేవట..ఫ్రెండ్స్ గా ఉందామని శివ బాలాజీ చెప్పినా...నో ఛాన్స్ అంటూ మధుమిత అతడిని దూరం పెట్టేసిందట.
జాతకాల కారణంగా విడిపోయిన ఇద్దరు ఆ తర్వాత మా ఎలక్షన్స్ సందర్భంగా ఒకరినొకరు తారసపడ్డారు. కానీ, మాజీ ప్రేమికుల మధ్య మాటలు లేవు. మాట కలిపేందుకు శివ బాలాజీ ట్రై చేసినా మధుమిత మాట్లాడలేదు. మధుమితకు ఆమె తల్లిదండ్రులు పలు సంబంధాలు తెచ్చినా..దేనికి అంగీకరించకుండా దాటవేస్తూ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శివ బాలాజీ..తన తప్పు తెలుసుకొని ఆమెకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అలా ప్రయత్నించగా ఒక రోజు తన జీవితంలోకి మళ్లీ ఎందుకు వస్తున్నావంటూ మధుమిత..శివ బాలాజీకి మెసేజ్ చేసిందంట..దీంతో ఛాన్స్ దొరికిందంటూ పేచప్ కు ట్రై చేశాడట.
బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధపడ్డానంటూ, ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించిందని మాట కలిపాడు. పెళ్లి చేసుకుందామని మళ్లీ ప్రపోజల్ పెట్టాడు. ఈసారి జాతకాలు చూపిస్తే అంతా సవ్యంగానే ఉందని పండితుడు చెప్పాడు. ఇంకేముంది, మళ్లీ పెద్దలను ఒప్పించి తమ ప్రేమను శివ బాలాజీ-మధుమిత జంట గెలిపించుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పేర్లు ధన్విన్, గగన్.