Singer Sunitha: నా రెండో పెళ్లి గురించి మీకెందుకు.. సంస్కారం ఉన్న మనుషులు ఇలా మాట్లాడరు..

Singer Sunitha: సింగర్‌ సునీత..స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌.

Update: 2022-09-17 14:30 GMT

Singer Sunitha: నా రెండో పెళ్లి గురించి మీకెందుకు.. సంస్కారం ఉన్న మనుషులు ఇలా మాట్లాడరు..

Singer Sunitha: సింగర్‌ సునీత..స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. సునీత గానంతోనే కాదు.. రూపంలోనూ ఆకట్టుకుంటుంది. ఆమె నవ్వుకు ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో వందల పాటలు పాడిన సునీత గతేడాది వ్యాపార‌వేత్త రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సునీత తన దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత భావోద్వేగానకి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'జీవితంలో నాకు మెంటర్‌ బాల సుబ్రమణ్యం గారు. ఒకానొక సమయంలో ఎంతో డిప్రెషన్‌లోకి జారుకున్నాను. నాకు మళ్లీ స్ట్రాంగ్‌ చేసిన ఏకైక వ్యక్తి ఆయనే. బాలు గారు అంటే భక్తి, బాలు గారు అంటే అభిమానం, బాలు గారు అంటే జీవితం' అంటూ సునీత కంటతడి పెట్టుకున్నారు.

ఇక రెండో వివాహంపై జరిగిన ట్రోలింగ్‌ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నలకు సునీత బదులిస్తూ.. కెరీర్‌లో చిత్రగారి తర్వాత 120 హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్‌ చెప్పానని, చాలామంది ఎంటర్‌టైన్‌మెంట్‌కి కారణమయ్యానంటారు కదా.. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్‌ జీవితం మీద ఎందుకు ఫోకస్‌ పెడుతున్నారు? సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. ఒక మనిషిని ఒకమాట అనేముందు ఒక్క క్షణం ఆలోచించాలి అంటూ యంకర్‌ను సూటిగా నిలదీసింది. ప్రస్తుతం సునీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News