Singer Sunitha: ఇంటిపట్టునే ఉంటే.. మీరు కోరిన పాటల్ని వినిపిస్తా: సునీత

Singer Sunitha: కరోనా సెకండ్ వేవ్ తో భారత్ లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.

Update: 2021-05-08 13:32 GMT

సింగర్ సునీత (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Singer Sunitha: కరోనా సెకండ్ వేవ్ తో భారత్ లో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో పలు రంగాలకు చెందిన వారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. నెట్టింట్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సింగర్ సునీత కూడా తన ఫాన్య్‌ని ఇంట్లోనే ఉండండి.. మీరు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని అంటోంది.

వివరాల్లోకి వెళ్లే.. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నానని, వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతమయ్యానని చెప్పింది సింగర్ సునీత. మీ అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ఇన్‌స్టాగ్రాం ద్వారా లైవ్ లోకి వస్తున్నానని అన్నారు. అత్యవసరమైన పనులు లేకపోతే ఇంటిపట్టునే ఉండాలని, మీరు అడిగిన పాటల్ని ప్రతిరోజూ పాడి ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు పాటలను ఆలపించారు సింగర్‌ సునీత. నాగార్జున సినిమా 'నేనున్నాను' నుంచి 'చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని..' పాట పాడి, దానిని వైద్యులు, ఇతర ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అంకితం ఇచ్చారు. ఇకపై ప్రతిరోజూ రాత్రి 8గంటల నుంచి 8.30 గంటలపాటు లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె పేర్కొన్నారు.


Tags:    

Similar News