Singer Sunitha: "నా భర్త ఎంత సంపాదిస్తున్నాడో నాకు తెలీదు" - సునీత

Singer Sunitha: ప్రముఖ సింగర్ సునీత ఈ మధ్యకాలంలో తన పాటల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Update: 2021-08-25 11:00 GMT

"నా భర్త ఎంత సంపాదిస్తున్నాడో నాకు తెలీదు" - సునీత

Singer Sunitha: ప్రముఖ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత ఈ మధ్యకాలంలో తన పాటల కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తూనే ఉంది. రెండవ పెళ్లి చేసుకున్న సునీత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది సెలబ్రిటీల లాగానే సునీత కూడా తన రెండవ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాలావరకు యాక్టివ్ గా ఉండే సునీత ఈ మధ్యనే తన పెళ్లి గురించి, పెళ్ళికి ముందు మరియు తర్వాత తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

టీనేజ్లో ఉన్నప్పుడు తాను కూడా మిగతా అమ్మాయిలు లాగానే పెళ్లి విషయంలో చాలా కలలు కనే దాన్ని అని అన్న సునీత మొదటి పెళ్ళిలో కేవలం బాధలను మాత్రమే అనుభవించి 15 ఏళ్ళ పాటు ఒంటరిగా కష్టపడుతూ వచ్చింది. "ఆ తరువాతే రామ్ ని కలిశాను. అప్పుడే నా జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకున్నాయి," అని అన్నారు. ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ, "ఇప్పటికి కూడా చాలామంది నేను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటారు. కానీ నిజానికి నా భర్త కి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, తన బిజినెస్ టర్నోవర్ ఎంత, అనే విషయాలు తెలియవు," అని క్లారిటీ ఇచ్చిన సునీత కనీసం తన భర్త ఎంత సంపాదిస్తున్నాడు అనే విషయం కూడా ఆమెకు తెలీదు అంటోంది.

Tags:    

Similar News