Singer Sunitha: నోరు మూయించే సమాధానం ఇచ్చిన సునీత

Singer Sunitha: నెటిజన్లకు గట్టిగా రిప్లై ఇచ్చిన సింగర్

Update: 2022-02-05 10:30 GMT

నోరు మూయించే సమాధానం ఇచ్చిన సునీత

Singer Sunitha: ప్రముఖ సింగర్ సునీత ఈమధ్యనే రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పెళ్లి సమయంలోనే నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ సునీత వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ కి సంబంధించిన డిజిటల్ అధినేత రామ్ వీరపనేనితో సునీత రెండవ వివాహం జరిగింది. ఇవాల్టికి వారి పెళ్లి జరిగి సంవత్సరం గడిచింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సునీత. దీంతో మళ్ళీ ఆమెపై స్టార్ట్ అయింది. సాధ్యమైనంతవరకు సునీత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కానీ ఈమె పై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ మాత్రం తగ్గటం లేదు.

తాజాగా సునీత మరియు రామ్ రామానుజులు విగ్రహం సందర్శించారు. అక్కడ వారిద్దరు దిగిన ఒక ఫోటో ని ఫేస్ బుక్ ద్వారా షేర్ పంచుకుంది సునీత. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటూ చెప్పుకొచ్చింది ఈ ఫోటో కింద "కాకి ముక్కుకు దొండ పండు" అంటూ ఒక కామెంట్ చేయడంతో ఆమె అతనికి ఘాటుగా రిప్లై ఇచ్చింది. "నోటి దూల నీది. నీ వారం భూమిది" అంటూ తన దైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది సునీత. ఆమె అభిమానులు కూడా ఆమెకే మద్దతు పలికారు. మరోవైపు సింగర్ గా టీవీ షోస్ మరియు సినిమాలతో సునీత కెరీర్ లో కూడా బాగా బిజీగా గడుపుతోంది. సమయం చిక్కినప్పుడు తన కుటుంబ సభ్యులతో వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు కూడా చేస్తుంది.

Tags:    

Similar News